ఈ మధ్య ఒక చిన్న వినోదకరమైన సంఘటన జరిగింది. ఒకానొక ఆఫీసులో పని చేసే ఒక స్నేహితుడిని అతని కొలీగ్ మందలించాడట, ఆఫీసు కంప్యూటర్లో పోర్నోగ్రఫిక్ వెబ్ సైట్లు చూస్తున్నావా, అని. ఈ అబ్బాయి తెల్లబోయి, ఛీ చీ అలాటిదేమీ లేదే అన్నడట. తరువాత అతను తన పాత చరిత్రంతా తోడుకుంటే కనబడ్డ సైట్లు ఇవీ !
http://www.telugupeople.com/home/index.aspx
http://www.andhrabhoomi.net/vennela.html
Naturally, he stopped reading telugu news papers online after that :).
తెలుగు సినిమాల్లో స్త్రీలు, ప్రత్యేకించి హీరోయిన్లు వేస్కునే బట్టలు చూసి అందరికీ నాలాగే కంపరం, వెగటూ, రోతా పుడుతున్నాయా, లేక నాలోనే ఏదైనా లోపం వుందా?
I have some questions regarding this issue. Any discussion/exchange of opinions, enlightenement is welcome.
1. దీని ప్రభావం మనుషుల మీదా, సంఘం మీదా ఏమైనా వుంటుందా?
2.ఆడవాళ్ళు ఇలాటి వస్త్రధారణని అవమానంగా humilitation భావించటం సబబేనా, లేక over reaction అవుతుందా?
3. ఇలాటి సినిమాలూ, ఉండీ లేనట్టున్న ఆ బట్టలూ చూస్తే, ఎవరికైనా, బహుశా అందరు మగవాళ్ళకూ voyeuristic taste వుంటుంది కాబోలు అనిపించదా? అప్పుడది మగవాళ్ళకి అవమానంగా అనిపించదా?
4.Is this a problem or just an annoyance? Is there anything anybody could do about this? Women’s organisations, thinkers, teachers?
5.Where does creative expression end and pornography begin?
ఆ సినిమాలు చూడటం మానేయొచ్చు కదా, అన్న సొల్యూషన్ నాకు తెలుసు. Is there any other way of fighting these indecent creatures?
You are 100% correct.
Not only many people are there to oppose this trend, but not expressing. we need active participation from youth.
I would like to share my feelings at following address
http://manaanubhoothulu.blogspot.com/2008/11/blog-post_30.html
ఈ మధ్య నా ఇంటర్నెట్ కేఫ్ లో రెగ్యులర్ కస్టమర్ ఒకతను బూతు బొమ్మలు చూస్తుండగా నేను ఇలాంటివి పర్మిట్ చెయ్యను అని అతనితో అన్నాను. అవి బూతు బొమ్మలు కావు, సినిమా హీరోయిన్ చార్మీ ఫోటోలు అని సమాధానం చెప్పాడు. అవి చార్మీ ఫోటోలే కానీ అవి అచ్చం సెక్స్ వెబ్ సైట్స్ లోని బొమ్మలు లాగ ఉన్నాయి. మన సినిమా హీరోయిన్ల్య్ పార్నో మోడెల్స్ స్థాయికి దిగజారిపోయారని అర్థమయ్యింది.
శారదగారూ నేనుకూడా మీ వాదనతో ఏకీభవిస్తున్నాను. ఇక్కడ కూడా వివిధ సంఘాలద్వారా ఈ విషయం ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విన్నవించబడుతూనే వుంది. కానీ ఈ పోటీ ప్రపంచంలో ఆధునికత పేరుమీద సినిమా తరువాత సినిమా కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. ఎప్పుడైనా ఎవరైనా నిర్మాతలు కానీ దర్శకులుగానీ ముఖ్యంగా తెలుగుదనానికి ప్రాముఖ్యతనిచ్చే సినిమాలు తీస్తే మళ్ళీ మిగతావాళ్ళూ వాళ్ళను అనుసరించగలరని ఆశించగలం.
Goodluck
నాకు డి.టి.పి. కం ఇంతర్నెట్ కేఫ్ ఉంది. ఒక సారి ఒక స్కూల్ స్టూడెంట్ నా కేఫ్లో సెక్స్ వెబ్ సైట్లు చూస్తుంటే నేను అతన్ని బయటకి గెంటేశాను. ఇంటర్నెట్ కేఫ్ ఓనర్లు చెయ్యదలచుకుంటే ప్రాక్సీ సర్వర్లు కూడా ఉపయోగించి సెక్స్ వెబ్ సైట్స్ ని బ్లాక్ చెయ్యొచ్చు. కానీ సినిమా హీరోయిన్ల బొమ్మలు ఉన్న వెబ్ సైట్స్ ని కూడా బ్లాక్ చెయ్యడానికి ఎంత మంది ఒప్పుకుంటారో తెలియదు.
మీకో విషయం తెలుసా, మా ఆఫీస్ ప్రాక్సీ సర్వర్ లో తెలుగు అనే పదాన్ని బ్లాక్ చేసారు. అంటే ఏదన్నా వెబ్ సైట్ కి దాని పేరులో telugu అని ఉందనుకోండి, ఆ సైట్ రిస్ట్రిక్టెడ్ సైట్ అని వస్తోంది. దీన్ని బట్టి ఆ పదం పోర్నో కి ప్రర్యాయం అయిపోయింది గామన్చని చాలా బాధ పడ్డాను.
కానీ దీనివల్ల నాకు కలిగిన లాభం ఏంటంటే, తెలుగు అనే పదం వాడ కుండా తెలుగు కోసం వెతుక్కుంటూ – అంత ఫేమస్ కానీవి, కాని మంచివి అయిన బ్లాగులు,సైట్లు – చూడగల్గుతున్నాను.
మసాలా అనే పదం వంటల వెబ్ సైట్స్ లోనూ వాడుతారు, సెక్స్ వెబ్ సైట్స్ లోనూ వాడుతారు. బూతు కాని పదాలని కూడా బూతులుగా మార్చే టాలెంట్ సెక్స్ వెబ్ సైట్స్ వీక్షకులకి ఉంది.
ఇంటర్నెట్ పార్నోగ్రఫీకి వ్యతిరేకంగా నేను కొత్త బ్లాగ్ తెరిచాను. దాని అడ్రెస్ http://netizen.pkmct.net ఈ మధ్య నా ఇంటర్నెట్ కేఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నన్ను ఆ బ్లాగ్ తెరిచేలా ప్రభావితం చేసింది. http://telugu-blog.pkmct.net/2009/04/blog-post_05.html
ఈ టాపిక్ కూడా చదవండి: http://anilroyal.wordpress.com/2009/04/23/ఛీ-ఛీ
మార్తాండ గారూ,
మీరు చూపించిన link చదివాను. ఆయన చెప్పినట్టూ టీవీలో ఆ Dances చూస్తే అసహ్యం కలగుతుంది.
ఇంటర్నెట్ కంటే టీవీ, సినిమా మరింత reach వుండి, చాలా అపాయకరమైనవని నా అభిప్రాయం. సెన్సార్ సెర్టిఫికేషన్ అంత నిజాయితీగా అమలు చేయని ప్రభుత్వామూ, ప్రజల వ్యవస్థ మనది. అదేదో ఆర్టికల్ లో చెప్పినట్టు, అరుంధతి లాటి సినిమాకి చిన్న పిల్లలని తీసికెళ్ళే ప్రజలున్నారు. అలాటప్పుడు, మన సినిమా, టీవీ ఇంకొంచెం బాధ్యతా యుతంగా ప్రవర్తించాల్సిన బాధ్యత వుంది. దురదృష్టవాశాత్తూ, అందుకు సరిగ్గా విరుధ్ధంగా జరిగింది.
తెరపై ఆడవాళ్ళని ఇంత చవకబారుగా, కేవలం fleshలాగా చూపించటం మీద సంఘం యుధ్ధం ప్రకటిస్తే గానీ పరిస్థితి చక్క బడదు. ఇది ఆడవాళ్ళనూ, మగ వాళ్ళనూ కూడా అవమానించటమే. అయితే ఈ యుధ్ధంలో ఎలా ప్రొసీడవాలో తెలియటం లేదు.
పబ్లిక్ ప్లేసెస్ లో సెక్స్ గురించి మాట్లాడితే పరువు పోతుందనుకుంటారు. అలా అనుకునే వాళ్ళే ఇంటిలో టి.వి. వేసుకుని బూతు డాన్సులు చూస్తుంటారు. నీతి అనేది కేవలం పబ్లిక్ లో పరువులో ప్రతిష్టలు ప్రదర్శించుకోవడానికేనా? వ్యక్తిగత జీవితంలో కూడా నీతిని ఆచరించాల్సిన అవసరం లేదా? నీతి పేరు చెప్పుకుంటూ నీతిలేని బతుకు బతకడం చూస్తోంటే నాకు నిజంగా అసహ్యం కలుగుతోంది.
అరుంధతి సినిమాల గురించి వ్రాసిన ఆర్టికల్స్ పూర్తిగా చదవండి. ఆ సినిమా గురించి ఇచ్చిన హైప్ పబ్లిసిటీ చూసి పిల్లలు చూడడానికి కూడా బాగుంటుందనుకుని ఆ సినిమాకి పిల్లల్ని తీసుకెళ్ళిన వాళ్ళే ఎక్కువ. పిల్లలు ఆ సినిమా చూసి పీడ కలల బారిన పడతారని మాత్రం తీసుకెళ్ళిన వాళ్ళు ఊహించలేదు.
1. దీని ప్రభావం మనుషుల మీదా, సంఘం మీదా ఏమైనా వుంటుందా?
ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒక్క విషయం, ఈ ధోరణికూడా ఆ ప్రభావం వల్లనే అయ్యుండొచ్చుకదా! సినిమా మన దగ్గర ఒక అసంపూర్ణస్వప్నాల్ని అందిపుచ్చుకునే ఒక (చీకటి) ఊహాలోకం. ఆ లోకంలో అణగారిన కోరికలుంటాయి, అందుబాటులో లేకపోయినా ఆశపడే అందాలుంటాయ్,సాహసాలుంటాయి,అసంబద్ధ పోకడలుంటాయి. అంటే సమాజనికి అద్ధం సినిమాలైతే, సినిమా అద్ధాన్ని చూసి ఇమిటేట్ చేసేవారికీ తక్కువలేదు.
2.ఆడవాళ్ళు ఇలాటి వస్త్రధారణని అవమానంగా humilitation భావించటం సబబేనా, లేక over reaction అవుతుందా?
సినిమా హీరోయిన్ వృత్తి (హీరోతోపాటూ)ప్రేక్షకుడ్ని titillate చేసి రంజింపజెయ్యటం. దాన్నొక ప్రొఫెషన్ గా చూస్తే, వారు వేసుకునే దుస్తుల్ని చూసి బాధపడనవసరం లేదు. కానీ, మనకున్నది “విలువల దృష్టి”. ఇలా ఉంటే “తప్పు” అనే pre-conditioned ధృక్కోణం నుంచీ చూస్తే మనకు మిగిలేది humiliation, అయ్యేది over reaction.
3. ఇలాటి సినిమాలూ, ఉండీ లేనట్టున్న ఆ బట్టలూ చూస్తే, ఎవరికైనా, బహుశా అందరు మగవాళ్ళకూ voyeuristic taste వుంటుంది కాబోలు అనిపించదా? అప్పుడది మగవాళ్ళకి అవమానంగా అనిపించదా?
చాలా మంది మగవాళ్ళు సినిమాకి వెళ్ళేదే ఈ voyeuristic pleasure “కుతి”ని అనుభవించడానికి. తమ suppressed sexuality కి ఒక చీకటి outlet కోసం. మరి ఇందులో అవమానంగా ఫీల్ అవడానికి ఏముంది? సినిమా ఒక గౌరవప్రదమైన దారాయె!
4.Is this a problem or just an annoyance? Is there anything anybody could do about this? Women’s organisations, thinkers, teachers?
మహిళా సంఘాలు ఎన్నోసార్లు ఈ “బూతు” సంస్కృతి మీద ధ్వజమెత్తి సినిమాహాళ్ళను ధ్వంసం చేశారు. అప్పటి నుండీ ఇప్పటి వరకూ ఈ ధోరణి సామాన్య ప్రజల్లో అంగీకారాత్మకం అయిపోవడంతో వీళ్ళకు చెయ్యడానికి ఏమీ మిగల్లేదు. ఇదొక విస్తృత సామాజిక ధోరణి దీనకి సమాధానం ‘ఎవరో ఒకరు’ వెతకడం కష్టం. సమిష్టిగా ఒక ప్రయత్నం జరగాలి. కానీ ఈ సమస్యను define చెయ్యడంలోనే చాలా సమస్యలున్నాయి. అందుకే బహుశా ఇంతవరకూ “ఇది చెయ్యాలి” అని చెప్పగలిగేవాళ్ళు లేరు. ఈ సందర్భంలో film studies లాంటి ఒక పరిశోధన చాలా అవసరం.
ఈ క్రింది లంకెలోని వ్యాసాన్ని ఒకసారి చూడండి
http://navatarangam.com/2008/08/telugu-sex-films/
5.Where does creative expression end and pornography begin?
Both are projected to be interrelated. Though they are actually not. Its saleability that is determining soft-pornographic aspects in mainstream Indian cinema, Telugu cinema in particular.
దీని మీదనెంత క్లుప్తంగా వీలయితే అంత క్లుప్తంగా నేను వ్రాస్తాను.
– అవును ఇది జుగుప్సాకరమే. ప్రత్యేకించి మీరు ఒక కోవకి చెందని వారైతే, ఆ కోవ ఏంటంటే, ఎంత వయస్సువచ్చినా కోఱికలు తీర్చుకోడానికి “సభ్య”మైన విధానం లేక సినిమాలను చూసి “సంతృప్తి” పడవలసిన దౌర్భాగ్యమున్న యువత. ఆ కోవకు మీరు చెందకుంటే ఇది పూర్తి జుగుప్సే.
– పైన ఉదహరించినట్టు, కొందరికి జుగుప్స అనిపించింది, కొందరు నిత్యం వృత్తి ధర్మంగా చేస్తూవుంటారు. ఉదా – ఒక గాంధేయవాదికి మనుషులను చంపడానికి వాడే పరికరాలను తయారుచేయడమంటే పరమజగుప్స వుంటుంది. కొందరికి అది జీవనాధారం, వారు “arms escalation మా పూచీ కాదు, మేము మా కర్మ నిర్వత్తిస్తున్నామంతే” అంటారు.
– కాబట్టి మనము సినిమా హీరోయిన్లనూ పని మానమనలేము, అలానే సైంటిష్టులనూ పని మానమనలేము.
– ఐతే ఏం చేయాలి? వెనకటికి ఎవరి ఇంట్లో వారు, ఎవరి చేలో వారు వుండేవారు, జుగుప్స కనబడడానికి ఆస్కారం వుండేది కాదు. ఈ రోజుల్లో అలా కాదు. ఉదయాన్నే పేపరు పేరిట మనం దాన్ని కొనుక్కుంటున్నాం (ఎంత జుగుప్సాకరమైన ఇంసెస్టయితే అంత పెద్ద అక్షరాలతో కనబడుతోంది). ఇక టీవీ పేరిట జగుప్సను ఆధరిస్తున్నాము పూజిస్తున్నాము.
చివరకు చెప్పేదేంటంటే, ఆ పుంతలు త్రొక్కవద్దు.
ఎక్కడ జుగుప్సాకరమైన సినిమా ప్రస్తావన వుంటుందో అటు వెళ్ళవద్దు.
(అటు మానేసి మా నవతరంగానికి రండి).
అలానే. వినియోగదారుతత్వం ఇష్టంలేకుంటే ఓ-సో-కూల్-బ్యాంకరుగా పని చేయవద్దు. అంతే!
నాకు కూడా జుగుప్స పెద్ద సమస్య. తగ్గించుకోవడానికి సకల విధాలా ప్రయత్నిస్తున్నాను. మీకు ఏమైనా మంచి పద్ధతులు తెలిస్తే మీ సహోదరునిగా భావించి, నాకునూ తెలుపగలరు.
యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి ।
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే ॥
రాకేశ్వర.
ఇప్పుడే కత్తి మహేష్ గారి బ్లాగ్ లో తెలుగు సినిమాలలో స్త్రీల వస్త్ర ధారణ అనే టపా చదివాను. http://parnashaala.blogspot.com/2009/05/blog-post_29.html ఈ టపాలో మహేష్ గారి అమాయకత్వం కనిపిస్తోంది. సినిమా వాళ్ళకి నిజాయితీ ఉంటుందని నమ్మితే అది నిజంగా అమాయకత్వమే. సినిమా ప్రొడ్యూసర్లు తమ భార్యలనో, కూతుళ్ళనో, కోడళ్ళనో పెట్టి సినిమాలు తియ్యరు, తియ్యలేరు. అలా తియ్యడం తమ కుటుంబ పరువుకి భంగం కలిగిస్తుందని కూడా భావిస్తారు. ఇది వాళ్ళ హిపోక్రిసీ యొక్క అసలు రంగు. చలం గారి సాహిత్యం చదివినా ఈ విషయం అర్థమైపోతుంది. పురుషాధిక్య సమాజంలో మగవాడు పరాయి ఆడదాన్ని మోహిస్తాడు కానీ తన భార్యని వేరేవాడు మోహిస్తే సహించలేడు. మగవాడు ఆడదాన్ని ప్రైవేట్ ఆస్తిని చూసినట్టు చూస్తున్నాడని చలం గారు గ్రహించారు కానీ చలం సాహిత్యం చదివినట్టు చెప్పుకున్న మహేష్ ఈ విషయం గ్రహించలేకపోవడం విచిత్రంగా ఉంది. సినిమా వాళ్ళకి నిజాయితీ ఉంటుందని నమ్మడం ఎందుకు జోక్ అవుతుందో రంగనాయకమ్మ గారు కూడా “మానవ సమాజం” పుస్తకంలో వివరంగా వ్రాసారు, చదవండి.
ఈ లింక్ కూడా వీక్షించండి: http://telugu.stalin-mao.net/2009/05/24/437
>>”ఆ సినిమాలు చూడటం మానేయొచ్చు కదా, అన్న సొల్యూషన్ నాకు తెలుసు. Is there any other way of fighting these indecent creatures?”
హీరోయిన్ల ఒళ్ళు ప్రదర్శనలకు ప్రజలు ఎగబడుతుంటే దాదాపు ప్రతీ సినిమా హిట్టు కావాలి. మన తెలుగు ఇండస్ట్రీలో హిట్టు సినిమాలు సంవత్సరానికి పదికి మించవు. కాబట్టి కేవలం హీరోయిన్ల ఒళ్ళు ప్రదర్శనలతో హిట్టయిన సినిమా నాకు తెలిసి ఒక్కటి కూడా లేదు. ప్రజలు ఇంత డైరెక్టుగా చెబుతున్నా ఎందుకనో దర్శక, నిర్మాతలు మళ్ళీ అదే విధంగా తీస్తుంటారు.
కాని ఒక్క విషయం, ఈ హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ విషయంలో నాకు తెలుగు సినిమాలంటే కొద్ది పాటి గౌరవం ఉంది. ఎందుకంటే, హాలీవుడ్డు, బాలివుడ్డు, కోలివుడ్డు ఇలా అన్నిరకాల ఉడ్డులతో పోలిస్తే, మన సినిమాల్లోని హీరోయిన్ల బట్టలు చాలా చాలా మెరుగు. అలాగే మన వాళ్ళు కొద్ది పాటి హద్దుల్లో ఉంటారు.
శృంగారం, హింస వున్నా కూడా మనవాళ్ళు హాస్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అందువల్ల కూడా తెలుగు సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం.
ఒకవేళ జనం బూతు సినిమాలు మాత్రమే చూసే రకమైతే శంకరాభరణం లాంటి సినిమాలు ఎలా హిట్ అయ్యాయి? అది కూడా జయమాలిని, జ్యోతిలక్ష్మిల సినిమాలు ఆడే రోజుల్లో?
==> “కంపరం, వెగటూ, రోతా” పుట్టించేసుకుని కొన్ని ప్రశ్నలు సంధించారు.
మహేష్ గారూ,
I found this rather amusing usage, పుట్టించేసుకుని. ఆ ఫీలింగ్సు నేను పనిగట్టుకుని పుట్టించుకోలేదు. ఎందుకో మరి నాలో పుట్టాయి. నాలా ఇంకెవరైనా పుట్టించేసుకుని, పట్టించుకుంటున్నారా, లేక మీలా పెద్ద మనసుతో అర్ధం చేసుకుంటున్నారా అన్న విషయం తెలుసుకోవటానికే ఈ చర్చ లేవనెత్తాను.
ఇంతకు ముందొకసారి మీరు “ఇందులో తప్పు వుందా లేదా అనేది మనం తొడుక్కునే విలువలని బట్టి వుంటుంది” అన్న అర్ధం తో రాసారు. I am not quoting verbatim. Just for clarification నేను తప్పొప్పుల మాట పట్టించుకోవటంలేదు. Those are very subjective. ఆ ఆడవాళ్ళు ఎందుకు బట్టలిప్పుకుంటున్నారు? ఆ సినిమా మేకర్స్ ఎందుకు అలా తయారు చేస్తున్నారు లాటి ఫిలసాఫికల్ ప్రశ్నలజోలికీ నేను పోలేదు. ఎందుకంటే వాటికి జవాబులు అందరికీ తెలుసు కాబట్టి.
నా ఆలోచనల్లా రెండే విషయాల గురించి-
1) ఎటూ కాని వయసులో వున్న టీనేజర్స్ మీద ఇలాటి అంగాంగ ప్రదర్శన ఎలాటి పరిణామాలనిస్తుంది? వాళ్ళకి ఆడవాళ్ళ మీదా, శారీరక సంబంధాల మీదా ఎలాటి అభిప్రాయాలేర్పడతాయి? ఏవైనా నెగెటివ్ ఎఫెక్టులుంటే వాటిని మనం ఎలా ఎదుర్కొంటాం?
(రాకేశ్వర రావుగారి కామెంటు చాలా ప్రాక్టికల్గా వుంది.)
2) ఆడ వాళ్ళని కేవలం lumps of fleshలా స్టీరియోటైపు చేస్తుంటే చాలా అసహనంగా అవమానంగా అనిపిస్తుంది. మగవాళ్ళని You are just an imbecile who buys anything if sold by a near naked woman అని పదే పదే స్టీరియోటైప్ చేస్తే మగవాళ్ళకి చిరాగ్గా వుండదా? మీ వ్యాసానికొచ్చిన వ్యాఖ్యలు చూస్తుంటే నా ఆలోచన నిజమేననిపిస్తుంది. (భవాని, అబ్రకదబ్ర, సృజన గారి వ్యాఖ్యలు.)
“నువు స్వతంత్ర జీవివి. పుచ్చుపట్టిన భావాలకూ సంప్రదాయాలకూ భయపడాల్సిన పని లేదు. నీ ఒంటి గురించి సిగ్గు పడాల్సిందేమీ లేదు. నలుగురికీ చూపించు. చూపించి గర్వపడు. భగవంతుని సృష్టిలోకెల్లా అద్భుతమైనది స్త్రీ. ఆ స్త్రీ సౌందర్యాన్ని చూడటానికి అందరికీ హక్కు వుంది. తన అందాలు చూపించుకోవటంలో ఆడదానికి సంఘం పెట్టిన ఆంక్షలని ఎదిరించి పోరాడు.” ఇవి రాంగోపల్ వర్మ టైపు మేధావులు చెప్పే ప్లాటిట్యూడ్స్. వినటానికి ఇవి స్త్రీవాదం లా వినిపించినా నాకెందుకో అవకాశవాదం, పురుష వాదం లా అనిపిస్తాయి.
Before you cry foul again, ఇక్కడ చర్చ సంప్రదాయాల గురించీ, సంఘం కట్టుబాట్ల గురించీ కాదు. మనుషుల self respect గురించీ, దాన్ని మీడియా పదే పదే దెబ్బ తీస్తున్న విధానం గురించీ.
సంప్రదాయం ఆడదాన్ని తన శారీరం గురించి సిగ్గుపడమంటే, మీడియా మేధావులు ఆ శరీరాన్ని చూసి గర్వ పడమంటారు. నాకిద్దరూ నచ్చరు. శరీరమే కాకుండా, ఆడదానికి మేధస్సూ, ఆత్మ గౌరవమూ, ఆలోచనా, వృత్తీ, ప్రవృత్తీ లాటివి వున్నాయి. వీటిని కించపరిచి, అవమానించేదే ప్రక్రియైనా సంఘానికి మంచిది కాదు, అని నా అభిప్రాయం. ఇదే అభిప్రాయంతో ఇంకెవరైనా వున్నారా లేదా అన్న విషయం తెలుసుకోవటానికి నేనీ విషయాన్ని చర్చకు పెట్టాను. ఈ చర్చల వల్ల క్రియా రూపంలో ఏదైనా మంచి జరిగితే that is always welcome.
శారద
నాగ ప్రసాద్ గారూ,
మీరన్నది కూడా నిజమే. మిగతా ప్రపంచంలో మీడియా మామూలు మనుషుల మీద చేసే దాడి చెప్పనలవి కాకుండా వుంది!
శారద
1970లలో జయమాలినీ, జ్యోతిలక్ష్మిల సినిమాలు ఆడుతున్న రోజులలో కూడా బూతు లేని శంకరాభరణం సినిమా హిట్ అయ్యింది. బూతు సినిమాలు మాత్రమే హిట్ అవుతాయనుకుంటే అది భ్రమే. జనం వేరే సినిమాలు దొరక్క జయమాలిని, జ్యోతిలక్ష్మిల సినిమాలు చూసి ఉండొచ్చు. అందుకే ఆ సినిమాలు హిట్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ముమైత్ ఖాన్ సినిమాలలో జ్యోతిలక్ష్మి సినిమాల కంటే ఎక్కువ బూతు కనిపిస్తోంది. అయినా ముమైత్ ఖాన్ సినిమాలు ఎక్కువగా హిట్ అవ్వడం లేదు.
@రాకేశ్వర్; బాగా చెప్పారు. కొంచెం ఇలాంటిదే నేనూ శారదగారికి చెప్పడానికి ప్రయత్నించాను. కాకపోతే దానిలో ignore చెయ్యడంతో పాటూ affirmative action యొక్క సూచన ఉంది అంతే!
@శారద: “పుట్టించుకుని” అనే పదప్రయోగం అసంకల్పితంగా చేసినా ఇప్పుడు అర్థవంతంగానే అనిపిస్తోంది.
Pavlovian classical conditioning theory ప్రకారం మన response యొక్క నెపం stimulus మీదపెడితే సరిపోదు. మనదైన conditioning చేసుకుని ఆ రెస్పాన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే మీ కంపరం, వెగటూ, రోతలకు కారణం మీరేతప్ప మీరు చెప్పిన కారణాలు కాదు.
ఇక టీనేజర్స్ మీద పరిణామాల గురించి చర్చించడానికి కొంచెం social conditioning కొద్దాం. “విలువలు” అనేవి సామాజికం.అత్యంత పురానం. అలాంటి వాటిని సినిమాలాంటి ఒక పాప్యులర్ కల్చర్ ‘సమూలంగా’ మార్చగలుగుతోందంటే సమస్య అనుకున్నంత సులువైనది కాదు అని చెప్పుకోవాలి.
కానీ ఆసమస్యకుతగ్గ శోధన,పరిశోధన జరగటం లేదనేది సుస్పష్టం. అందుకే సమస్యని define చెయ్యడంలో చాలా సమస్యలున్నాయని నేనన్నాను. మనం కంటి ముందుకనిపించే నిజాల్ని objective గా చూడకుండా విలువల prism లోంచీచూడ్డంకూడా ఈ సమస్య మరింత తీవ్రమవ్వడానికి కారణభూతాలవుతున్నాయి.
స్టీరియోటైపింగ్ అనేది ఒక recognizable identity సృష్టించడంలో జరిగే ప్రయత్నం. మగాళ్ళందరూ వీటిని అంగీకరించనఖ్ఖరలేదు. ఆడావాళ్ళందరూ ఈ ఆలోచనకు confine అవనక్కరాలేదు. కానీ ఇలాంటి స్టీరియోటైపింగ్ ఉంది. అనే నిజాన్ని అంగీకరిస్తే చాలు.సమస్యకు సమాధానం దిశగా రెండడుగులు వేసినట్లే. కానీ కొందరు “మర్యాదస్తుల” కారణంగా అదికూడా జరగడం లేదు అనేది నా అభియోగం.
రాంగోపాల్ వర్మ మేధావితనానికి సరితూగే మహిళా మేధావి శోభాడే ని కూడా చదవండి. రెండువైపుల్నుంచీ ఎంత దారుణమైన వాదాలు వినిపిస్తాయో!చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
I don’t cry foul, because my intention is same as yours. But, my approach is different thats’ all.
శారదగారూ, ఇలా మన మధ్య చర్చలు ఇది రెండోసారి. ఎందుకో చెప్పలనిపించింది.
నేను వ్రాసినది మళ్ళీ చదవండి
>>>ఒకవేళ జనం బూతు సినిమాలు మాత్రమే చూసే రకమైతే శంకరాభరణం లాంటి సినిమాలు ఎలా హిట్ అయ్యాయి? అది కూడా జయమాలిని, జ్యోతిలక్ష్మిల సినిమాలు ఆడే రోజుల్లో?>>>
సినిమాలలో బూతు లేకపోయినా హిట్ అవుతాయి. ఈ విషయం తెలిసి కూడా బూతు సినిమాలు మాత్రమే హిట్ అవుతాయని భ్రమ పడడం ఎందుకు?
శారద గారు,
మీరు మగవారికి చిరాకు రాదా అని అడుగుతున్నారా?
దాని జవాబు చాలా సరళం. నీచమైన ప్రవర్తన చూస్తే ఎవరికైనా చిరాకే వేస్తుంది (కనీసం ఆలోచించే ఎవరికైనా). బైకు ప్రకటనల నుండి టీవి ప్రకటనల వఱకూ ప్రతి దానిలోనూ అర్థనగ్న ఆడవారిని చూపించిడం నీచమైన పని అని ఎవరైనా ఒప్పుకుంటారు.
*ఇందులో పురుష స్త్రీ బేధాలు లేవు*
బాబా రామదేవ్ అన్నారు, “యువకులూ మీ ఇంట్లో, ఎవరో అక్క ఫోటోనో, ఎవరో అమ్మ ఫోటోనో పెట్టుకోవద్దు, భగవంతును ఫోటో పెట్టుకోండని”. ఎంత మెత్తగా చెప్పాడు మహానుభావుఁడు అనిపించింది.
అలాగని అందమైన అమ్మాయిలు చూపిస్తే మగవారందఱూ కళ్ళు మూసుకుంటారా అంటే, అబ్బే లేదు. మనుషులు ఎదిగిన జంతువులు. మగసింహాలూ, మగనీటేనుగులు, మగనాగుపాములూ అయితే బాలింతరాళ్ళతో సంభోగించడానికై వారి పసి పిల్లలను చంపేస్తాయి. అది సృష్టిలోఁ ‘మగ’ విధానం. చూడలనేది ”మగ’ మానుష్య బలహీనత.
ఇక స్త్రీలకు కూడా నలుగురు మగవారిని తమవైపు ఆకట్టుకోవాలనే తపన కూడా వుంటుంది. లీమర్లలో, పొట్టేళ్ళలో నలుగురు మగవాళ్ళు వచ్చి పోటీపడితే ఎవరు నగ్గితే వాళ్ళతో ఆమె జతకడుతుంది. ఇది వారి బలహీనత. (మంచి జన్యువులు తరువాతి తరాలకు సంక్రమించడం వుద్ధేశ్యమని మనం సర్ది చెప్పుకోవచ్చు.)
మొత్తానికిలా మనుషుల బలహీనతలను సొమ్ము చేసుకుంటుంది కాబట్టి, ఆ విషయం తెలిసిన మనకు అది జుగుప్సాకరమైన పని అనిపిస్తుంది. After all, art is supposed to appeal to the positive aspect of humanity.
ఏదైమైనాగానీ మనలో పుట్టిన జగుప్స మనకే నష్టం కలిసిస్తుందిగా?
ఇక ఈ ప్రవృత్తిని మార్చడానికి ఉపాయాల విషయమై, నాకైతే ఎటువంటి ఆశా లేదు. వీటి వెనుక గల కారణాలు చాలా బలమైనవి గనుక. మనము చేయగలిగినదల్లా వాటిలో సాధ్యమైనంత తక్కువ పాలుపంచుకోవడం.
– రాకేశ్వర
ఇంకొక లంకె
మహేష్ గారూ,
ముందస్తుగా, నా రాతలు చదివి, వాటి గురించి ఆలోచించి,మీ అభిప్రాయాలూ, ఆలోచనలూ పంచుకున్నందుకు నేనెంతైనా కృతఙ్నురాలిని. అయితే నేను వెంట వెంటనే జవాబులివ్వను. Trust me, the fault is entirely mine. విపరీతమైన పని ఒత్తిడి, time pressure ఒక కారణమైతే, my irritating slow speed in typing in Telugu is the other. పైగా నా కలగాపులగం తెలుగు-ఇంగ్లీషు భాష గురించిన ఆత్మ న్యూనత ఒకటి. ఇవన్నిటి వల్లా నేను రెగ్యులర్ గా చర్చల్లో జవాబులివ్వను కానీ, personally I appreciate and enjoy any healthy exchange of ideas. After all, that is how wew all learn and remember, I am a researcher by profession :).
రాకేష్వర్ గారూ, మీరన్నట్టు స్త్రీ అందాన్ని ఆరాధించటం, ప్రేమించటం మగ లక్షణం. I guess it is hard coded into the male genes, to assure the propagation of the species, just as nurturing is hard coded into the female psyche. Just as attracting a prospective mate with whom one has the maximum probability of producing a healthy offspring, is hard coded into both the sexes. But there is lot of difference between “flesh show” and “feminine beauty, isn’t it? The former is annoying, while the latter is alluring. I think we are all in agreement here.
మరైతే దీన్ని గురించి ఏం చేయాలి? Ofcourse ignoring is one thing. ఇంతకుముందు నేనూ అలానే అనుకునేదాన్ని. కానీ ఈ మధ్య ఇంకా ఏదైనా చేయాలేమో ననిపిస్తుంది. నేను నా స్నేహితురాళ్ళతో చర్చించి, అలాటి సినిమాలని చూడటం కొంచెం డిస్కరేజ్ చేసాను. అలానే కొంచెం ఆలోచించ గల వారు, వాళ్ళ అభిప్రాయాలని ప్రొపగేట్ చేస్తే ఏమైనా ప్రయోజనం వుంటుందేమో.
గ్రంధ విస్తరణ భయం వున్నా, రెండు విషయాలు చెప్తాను.
1)నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది, నేను ఎప్పుడైనా నసుగుతూ, “ఇంతింత flesh show వున్న సినిమాలు మనం చూడకుండా బహిష్కరించటం మంచిదేమో” అంటే, “మీరెందుకు మీ అభిప్రాయాలు అందరి మీదా రుద్దుతారు?” అన్న అర్ధంతో respondఅవుతారు. దానికి నేను, “అడ్డమైన flesh exhibitionని వర్మ టైపు దర్శకులు వ్యక్తీకరిస్తే అది creative freedomఅయింది కానీ, నేను పది మందికీ ఇదంత మంచిది కాదేమోనన్న అభిప్రాయం చెప్తే అది “అభిప్రాయాలని రుద్దటం” ఎందుకైంది?” అని అడిగింతరువాత కానీ జనాలకి నా మాట అర్ధం కాలేదు. వెరసి నేను చెప్పేదేమిటంటే, “చిన్న పిల్లలకి పొగాకు అమ్మటానికీ, పోర్నోగ్రఫీ అమ్మటానికీ స్వేచ్చ వుంది. We can get away with it using one fancy name or the other. కానీ మనుషులని వాళ్ళు చేస్తున్న అపాయకరమైన పనుల గురించి హెచ్చరిస్తే చాలు, you are viewed as a “moral police”, “culture autocrat”. ఇది నీతుల గురించీ, సంస్కృతి గురించీ కాదు, సంఘం భవిష్యత్తు గురించీ అని వివరించటానికి చాలా ఓపికే వుండాలి.
2) వర్జిన్ ఎయిర్వేస్ ఆస్ట్రేలియాలో వుండే స్థానిక ఎయిర్వేస్ కంపెనీ. చాలా చవకగా మెల్బోర్న్, సిడ్నీ, అడిలైడ్ మధ్య విమానాలు తిప్పుతూ వుంటరు. దాని ఓనరు సర్ రిచర్ద్ బ్రాన్సన్ అరుదైన వ్యాపారవేత్తగా పేరు పొందాడు. ఆయన వాళ్ళ సర్వీసులని అడ్వర్టైజు చేయటం కోసం రూపొందించే వ్యాపార ప్రకటనలు ఎంత అసహ్యంగా, sexistగా వుంటాయంటే ఏమాత్రం సభ్యతా, అభిమానమూ వున్న స్త్రీ పురుషులైనా తలలు వంచుకోవాల్సిందే. ఏంబర్ పెట్టీ అనే కాలమిస్టూ ఈ విషయమై కిందటి వారం అతన్నీ అతని ప్రకటనలనీ ఏకి పారేసింది. దానికతను, “ఏ కాలంలోనైనా sex sells” అనే సూత్రాన్ని చెప్పాడు. దానికావిడ, “పిచ్చి వాడా! నీ ఎయిర్వేస్ కి జనం ఎగబడేది నువ్వు ఇస్తున్న తక్కువ ధరల వల్ల. నీ చెత్త అడ్వర్తైజ్మెంట్ల వల్ల కాదు” అని వివరించింది. అతనికి ఎంత అర్ధమైందో మరి.
ఇలాగే మనం మన సినిమా మేకర్స్ కి వివరిస్తే ఏమైనా ఫలితం వుంటుందేమో. But who will bell the cat? Writing up and expressing our opinions in forums like nava
tarangam might be of some help.
Thanks to all you guys for the exchange of opinions, ideas and hopefully we can think of something to do.
regards
Sharada
బూతు అనే పదానికి స్పష్టమైన డెఫినిషన్ ఉంది. ప్రైవేట్ గా చేస్తే శృంగారం, పబ్లిక్ గా ప్రదర్శిస్తే బూతు. ఈ లాజిక్ ప్రకారం బూతు పత్రికలు, బూతు బ్లాగులు జనం మీదకి వదలడం కూడా నేరమే.
ఒక సారి రష్యాలో లెనిన్ ఇతర విప్లవకారులతో కలిసి సరోవరం పక్కన రెస్ట్ తీసుకుంటోంటే పడవ మీద వెళ్తోన్న యాత్రికులు పాడుతోన్న బూతు పాట వినిపించింది. విప్లవకారులందరూ ఆ పాటని అసహ్యించుకున్నారు. ఒకవేళ అసహ్యించుకోకపోతే లెనిన్ ఏమనుకునేవాడంటే “ఇలాంటి నీతిలేని వాళ్ళతో కలిసా నేను కొత్త సమాజాన్ని నిర్మించేది?” అని.
జనం అందరూ నీతిలేని వాళ్ళు అనుకోను. సమాజంలో నీతి ఇంకా బతికి ఉంది కాబట్టే బూతు లేని సౌందర్య సినిమాలు హిట్ అయ్యాయి. నాకు సౌందర్య గారు అంటే ఎంతో గౌరవం కానీ ఆమె చనిపోవడం విషాదాన్ని తలపింప చేసింది.
nenu me charchalo palgonataniki siddamuga unnanu.
you are right i support it
శారద గారికి, నమస్కారములు.
మీ వ్యాసం బాగుంది. దీనిపై చర్చలు కూడా అర్ధవంతంగా వున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం లేదా అని అన్నారు. నా ఉద్దేశంలో: ఉదా: మా కాలనీలో రోడ్డుమీద కుక్కలు ఎక్కువైపోయినాయి. నేను పురపాలక అధికారులకి ఫిర్యాదు చేశాను. ఫలితం శూన్యం .అప్పుడు న్యాయస్థానం ద్వారా ఫలితాల్ని సాధించా. అలాగే, పై సమస్యపై, స్రీ సంఘాలు, ( పురుష సంఘాలు రావేమోనని ) “సెన్సార్ బోర్డ్ ” పై ధ్వజమెత్తి, ఫలితం రానప్పుడు, (ఎట్లాగో రాదు అని తెలుసుకాబట్టి) న్యాయస్థానానికి వెళ్ళి మనం అనుకున్నది సాధించుకొవాలి అని నా అభిప్రాయం.
భవదీయుడు,
మాధవరావు.
I too feel exactly the same way as you. Yes it is humiliating to both men and women if one is sensitive enough. The dress sense of women even outside movies is repulsive. The dress some girls and women wear is sensuous and provocative. Its effect on the society is quite harmful.
You asked for a solution. One probable solution is writing articles in blogs and newspapers by concerned people. But most of us tend to be apathetic or complacent. The real solution is changing the system. That might sound a tall order. I suggest you read my articles on democracy in my blogs.
Narasimha Rao