కొన్ని నెలల క్రితం నేను “మార్గళి రాగం” అనే తమిళ సినిమా చూసాను.కొన్ని నెలల క్రితం నేను “మార్గళి రాగం” అనే తమిళ సినిమా చూసాను. సినిమా అంటే మామూలు సినిమా కాదు. శ్రీమతి బోంబే జయశ్రీ, శ్రీ టి.యం.కృష్ణ గారు కలిసి చేసిన రెండు గంటల కచేరీ ని అద్భుతంగా ఫిల్ము చేసారు.
సాధారణంగా కచేరీల్లో గాయకుడు/గాయని ఎంత బాగా పాడినా, గొప్ప సౌండ్ సిస్టం వుంటే కానీ దాన్లోని అందం అంతగా బయటికి రాదు. బహుశా మంచి సౌండ్ సిస్టం వుంటే తంబూరా నాదం కూడా ఎంత శ్రావ్యంగా వుండగలదో చూపించటానికి ఈ సినిమా తీసి వుంటారు, శ్రీ జయేంద్ర పంచాపకేసన్.
ఈ సినిమా ట్రైలర్ ని ఇక్కడ చూడండి.
http://www.margazhiraagam.com/trailer/index.html
ఈ సినిమాలో వినిపించే అద్భుతమైన సంగీతాన్ని గురించి నేనెక్కువగా చెప్ప దలచుకోలేదు. కానీ, ఏ మాత్రం అవకాశం వున్నా, మంచి థియేటర్ లో డిజిటల్ సౌండ్ సిస్టం మీద ఈ పాటలని వినమని మాత్రం సూచిస్తాను.
ఈ సినిమాలో బోంబే జయశ్రీ కంటే టి.యెం.కృష్ణ చాలా బాగా పాడేరు. అన్నిటికంటే ఆయన బెహాగ్ రాగం లో పాడిన “సారమైన మాటలెంతొ చాలు చాలు రా” అనే జావళి! ఆ తరువాత అదే జావళీ ని గురుచరణ్ పాడినా, టి.యెం. కృష్ణ అంత గొప్పగా పాడలేదు.
ఇదే జావళీ యూట్యూబ్ లో వినండి. పాడిన వారు శ్రీ సుబ్రమణ్యం గారు.
http://www.youtube.com/watch?v=kY4Avk4zpuw
అంతకు ముందే “శృంగారానికీ బూతు (పోర్నోగ్రఫీ) కీ ఏమిటి తేడా” అనే చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ పాట వింటుంటే నాకు సమాధానం కొంచెం అర్ధమైంది.
శృంగారంలో స్త్రీ భోగ్య పదార్థం కాదు. మనసులో కలిగే ప్రేమ భావనలకి శారీరికమైన వ్యక్తీకరణ (ఎక్స్ ప్రెషన్) ఇచ్చే కళాకారిణి. ఆమె శ్రంగార పరమైన భావ వ్యక్తీకరణ చూసినప్పుడు ప్రతీ మగ వాడికీ తనను ప్రేమించి, తను ప్రేమించే స్త్రీ గుర్తొస్తుంది. ఆమె మనసులో కలిగే ప్రేమ భావనైనా, ఎక్స్ ప్రెషనైనా ఆమె ప్రేమికుడి కోసం. ప్రపంచం లో వున్న మగవాళ్ళందరికోసం కాదు.
అందుకే చీర విప్పి నిలబడే సినిమా హీరోయిన్లని చూస్తే, అవమానమూ, అసహ్యమూ కలుగుతాయి. అందమైన జావళి వింటే, పెదవులపైన చిన్న చిరునవ్వు మొలుస్తుంది . (ఇది నా అభిప్రాయం మాత్రమే- నిరూపించబడిన నిజం, ప్రొవెన్ ఫాక్ట్ కాదు.)
ఈ సినిమా డిస్కు దొరుకుతుందేమోనని ఇంకా వెదుకుతున్నా.
మీరేమనుకోనంటే చాలాదారుణమైన బయాస్‌డ్ శ్టేట్మెంటొకటి చేస్తాను. బాంబే జయశ్రీ తన సీడీల మీద వేయించుకునేందుకు ఏదో స్టూడియోలో నానాకష్టాలూ పడి నదరు గా ఉండే బొమ్మలు తీయించు కున్నారు గానీ, ఆవిడ చూడ్డానికి అస్సలు బాగోరు. దీనికి కంపేరిజన్లో, కృష్ణ చాలా బావుంటాడు. సంగీత పటిమలో కూడా అతను ఆవిడకంటే ఓ రెండు మెట్లు పైనే. సో ఈ సినిమాకి వాళ్ళిదర్నీ ఎందుకు జత చేశారా అనేది నాకు తీరను సందేహం.
కొత్త పాళీ గారూ,
నిజానికి ఈ సినిమాలో సంగీతం తరువాత నాకు నచ్చిన అంశం అదే! జయశ్రీ సింప్లిసిటీ! Her utter disregard for her looks. ఆవిడ అసలు ఏ మాత్రం మేకప్పు లేకుండా ఫిల్ము చేయ బడ్డారు. దాని వల్ల నాకు ఆవిడ “అందంగా కనబడటం” అనే తాపత్రయం కంటే తన సంగీతం మీదనే ఎక్కువ ధ్యాస పెట్టిందనిపించింది. అది ఒక రకమైన కాన్ఫిడెన్సుని కూడా సూచింది. (నా అంద చందాల కంటే నా సంగీతం ఇక్కడ ముఖ్యమైంది (and I am unbeatable at it). I loved that confidence and sense of priority.
ఇద్దరు చాల పేరు ప్రఖ్యాతులున్న కళాకారులని ఒకే కచేరీలో చూడటం కూడ కొత్త అనుభూతే (జుగల్ బందీ లో తప్ప సాధారణంగా అలా వినలేం).
సంగీతం- జయశ్రీ -కృష్ణ ఇద్దరూ సమాన ప్రతిభావంతులైన, ఈ సినిమాలో ఆయన ఇంకా చాలా బాగా పాడేరు.
మీకు నోరూరించటానికి- ఆయన ఈ సినిమాలో అద్భుతమైన రాగం-తానం-పల్లవి చేసారు. :))
శారదగారూ, సారమయినమాటలెంతో ఇంతకుముందు మరెవరో పాడినప్పుడు విన్నాను. ఈరోజు మళ్లీ ఇక్కడ విన్నాను. చాలా బాగుంది.
కొత్తపాళీకి మీరిచ్చిన జవాబుతో నేను ఏకీభవిస్తాను. జయశ్రీ స్తోత్రాలేవో నాదగ్గర వున్నాయి కానీ విని చాలా రోజులయింది. ఈమధ్య సంగీతం ఇలా కంప్యూటర్ లో కనిపించినప్పుడే వినడం.