టీ. యెం. కృష్ణ – తంబూరా సహకారం

అనుకున్నట్టే జూన్ ఇరవయ్యో తేదీన టీ.యెం.కృష్ణ కచేరీ చాలా గొప్పగా జరిగింది. ఆయనకు వయొలీన్ సహకారాన్ని శ్రీ శ్రీరాం, మృదంగ సహకారాన్ని శ్రీ తంజావూర్ మురుగ భూపతి గారూ ఇచ్చారు.

కచేరీకీ మా అమ్మాయి మధువంతి తంబురా సహకారాన్నందించింది. అది మాకొక మంచి అనుభూతి, తనకొక మంచి అనుభవం. ఔత్సాహిక కళాకారులకు పెద్ద కళాకారులతో వేదిక మిద కూర్చుని తంబూరానో లేక మరేదైనా సహకారాన్నో అందించటం ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సిక్కిల్ సోదరీమణులతో వేదిక మిద కుర్చుని తంబూరా వాయించిన అనుభవాలగురించి మా వారు చెప్పుతూ వుంటారు. నేనూ ప్రముఖ సితార్ విద్వాంసులు డాక్తర్ చంద్రకాంత్ సర్దేశ్ ముఖ్ సితార్ వాయించినప్పుడు తంబురా సహకారాన్నిచ్చాను. ఇప్పుడు మా అమ్మాయి కూడా శృతి అడిలైడ్ ఆర్గనైజర్లు అడగ్గానే ఉత్సాహంగా ఒప్పుకుంది. ఆడిటోరియం లో ఫోటో లు తీయనివ్వకపోవటంతో ప్రోగ్రాం తరువాత రెండు ఫోటోలు తిసాము. కింద ఫోటోలో నల్ల సల్వార్ కమీజ్ వేసుకుని కృష్ణ గారి పక్కన నిలుచుని వుంది మా మధు.

టీ.యేం.కృష్ణ తన సంగీతానికెంత ప్రసిద్ధి చెందారో, అంతగా తన “non-traditional attitude” కి కూడా ప్రసిద్ధి చెందారు.
ఆ రోజు ఆయన తన కార్యక్రమాన్ని మామూలుగా వర్ణం తో ప్రారంభించలేదు. కనీసం గణేష స్తుతితో కూడా ప్రారంభించలేదు. ఖరహరప్రియ లో ‘చక్కని రాజ మార్గము” తో ప్రారంభించారు. అదేదో సంభాషణలో ఎవరో చెప్పినట్టు త్యాగరాజ కీర్తనలంటే నాకదో రకమైన “ఇది”. ఈ కీర్తన ఆయన కంఠంలో చక్కగా పలికింది. అయితే మరి ఈ వాక్యం మాత్రం అర్ధం కాలేదు, “చిక్కని పాలు మీగడ యుండ ఛీ యను గంగా సాగరమేల?” ఈ గంగా సాగరమేంటి, అదెందుకు “ఛీ” ఐంది? (సముద్రపు నీళ్ళా?) ఎవరైనా చెప్పగలరా?

తరువాత తమిళంలో ఒక భారతి పాటని ఆయన రాగమాలికలో పాడారు. అందులో విశేషమేమీ లేదు. విశేషమేమిటంటే పాటకి ముందు ఆలాపన కూడా వరుసగా నాలుగు రాగాల్లో చేసారు. చరణాల తరువాత స్వరం కూడా ఒక్కొక్క ఆవర్తనం ఒక్కొక్క రాగంలో పాడేసరికి నాకైతే ఈ ప్రయోగం భలే నచ్చింది. ఆయన వాడిన రాగాలు “బిళహరి, భైరవి, సామ, వసంత”. ఆ రోజు కచ్చేరీ అంతటిలో నాకీ పాటే బెస్టనిపించింది.

తరువాత సహాన రాగంలో “ఈ వసుధ నీ వంటి దైవము నెందు గనరా” పాడారు. వరాళి రాగం లో “కా వా వా, కందా వా” అనే పాట పాడేరు. నాకెందుకో వరాళి రాగం కానీ, మరీ ముఖ్యంగా ఈ పాట కానీ ఎప్పీలింగ్ గా అనిపించవు.

ఇక అప్పుడు తన central piece గా తోడి రాగం పాడి, “నిన్నే నమ్మినాను సదా” అనే శ్యామ శాస్త్రి కీర్తన పాడారు. అది అందరూ expect చేసినట్టు చాలా గొప్పగా వుంది.
 బ్రేక్ తరువాత పాడిన పాటలు మామూలుగానే వున్నాయి. పురందర దాస కీర్తన, ఒక తులసీదస్ భజన్, ఇంకొక పాప నాశం శివన్ పాట పాడారు. మా పిల్లలకైతే యమన్ కల్యాణ్ లో “శ్రీ రామ చంద్ర కృపాళు భజ మన” (తులసీదాస్) పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆఖర్న పూర్ణ చంద్రిక లో తిల్లాన, ఒక తిరుప్పుగళ్ పాడి మంగళం తో ముగించారు.

సాధారణంగా మా అడిలైడ్ వచ్చే కళాకారులు ఎప్పుడు పాడిన పాటలే పాడీ మహా చిరాకు పెడతారు. మా వూళ్ళో ఇలాటి కార్యక్రమాలకి అసలు జనం రాకపోవటం మూలాన హాలంతా ఖాళీగా వుండి వాళ్ళు నిరుత్సాహపడతారో ఏమో, మరి. “బ్రహ్మ మొక్కటే”, “కృష్ణా నీ బేగనే బారో”, “శ్రీ చక్ర రాజ సింహాసనేశ్వరి”, “సభా పతికి వేరు దైవం” తప్ప వేరే పాటలే పాడరు.

అలాటిది, క్రితం సారి గురుచరణ్, మొన్న TMK చక్కగా కొంచెం వేరే పాటలు పాడి సంతోష పెట్టారు. మా నాలుగో శుక్రవారం కచేరీలో పాడే పిల్లలకి ఇది చాలా ఉత్సాహాన్నిస్తుందని నా ఆశ!

6 thoughts on “టీ. యెం. కృష్ణ – తంబూరా సహకారం

  1. ధన్యవాదాలు కొత్త పాళీ గారు.
    ఒక interesting విషయం చెప్పటం మర్చే పోయాను! పాడేటప్పుడు ఆయన హావ భావాలు, హస్త విన్యాసాలు. అవి ఒక్కోసారి హిరణ్య కశిపుని చీల్చి చెండాడుతున్న నరహరిని గుర్తు చేస్తే, ఒక్కోసారి, “అంతా మాయే!” అన్న philosophical ముద్రలో కనిపించి భలే entertain చేసాయి.
    శారద

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s