ఒక ప్రేయసి- కింద జీన్సూ పైన షర్టనే నామధేయం కల గుడ్డ పీలికా-(యఙ్ఞోపవీతం మందాన ఓణీ అయినా పర్వాలేదు)- “ఏరా?మైండ్ దొబ్బిందా?” అంటూ మాట్లాడే సుకుమారి-“తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నే రెండంటా” అనే సొగసుకత్తె!
ఒక ప్రేమికుడు- ఏం చదువుతున్నాడో, ఎందుకు బ్రతుకుతున్నాడో అర్ధం కాదు- ఇంట్లో అమ్మా-నాన్నలతోని మర్యాదగా మాట్లాడటం రాదు కానీ- వయసొచ్చిందనీ, అర్జంటుగా ప్రేమలో పడాలనీ మాత్రం బానే తెలుసు!”నీలాటి దరిద్రపు మొహాన్ని ఎవడు ప్రేమిస్తాడే” అంటూ నాజూకుగా మాట్లాడతాడు. “ఏమ్మా? రాతృళ్ళు మీ ఆయన నిద్ర పోనివ్వటంలేదా?” అంటూ తల్లితోనే చమత్కరించగల మాటకారి!
వాళ్ళని చూస్తే ఏ మాత్రం సభ్యతా సంస్కారం వున్న వాళ్ళకైనా వాంతి తన్నుకొస్తుంది.
మధ్య మధ్యలో రెండర్ధాల పాటలూ- ఇవే కదా?
ఛీ! ఛీ! ఏమయింది నాకు? తెలుగు సినిమాలు మానేసినా వాటి గురించిన వార్తలూ సమీక్షలూ చదివిన ఫలితం. మళ్ళీ మొదటి కొద్దాం.
ఒక మంచి ప్రేమ కథలో ఏముంటాయి?
ఒక ప్రేయసి- కొంచెం తెలివీ, కొంచెం అమాయకత్వమూ, బోలెడు సంస్కారమూ, జీవితం పట్ల సీరియస్ నెస్సూ, దాన్ని బేలెన్సు చేస్తూ కొంచెం అల్లరీ- ఒద్దికా, అందమూ, వ్యక్తిత్వమూ, ఆలోచనలూ కలబోసిన విలక్షణమైన పడుచు.
ఒక ప్రియుడు- ఆమెని ఆమెలాగే ప్రేమిస్తూ ఆ ప్రేమని ప్రకటించటం కోసమూ, నిలబెట్టుకోవటం కోసం ఒకవైపూ, జీవితాన్ని దారిలో పెట్టుకోవటానికి చేసే ప్రయత్నాలొక వైపూ- రెండిటినీ సమన్వయ పరచే యువకుడు.
వాళ్ళని చూస్తే ప్రేమలో పడని వాళ్ళకి అర్జంటుగా ప్రేమించెయ్యాలనిపిస్తుంది. ఇంతకు ముందే ప్రేమించిన వాళ్ళకి వాళ్ళ ప్రేమ గుర్తొచ్చి పెదవులపై ముసి ముసి నవ్వు మొలుస్తుంది. వీటికి తోడు మంచి సంగీతం కూడా వంటే అది ఇంకో బోనస్సు! అలాటి కథలతో వున్న సినిమాలకి ఎప్పటికీ కాలం చెల్లదు, ఆదరణా తగ్గదు. దాదాపు ముఫ్ఫై యేళ్ళ కింద రీలీజయిన చష్మె-బద్దూర్ అనే సినిమాను మళ్ళీ ఈ మధ్యన చూసినప్పుడు నాక్కలిగిన ఆలోచనలు ఇవి.
సయీ పరాంజపే చాలా మంచి అభిరుచీ, ప్రతిభా కల దర్శకురాలు. ఆవిడ తీసీన అయిదు చిత్రాల్లో మూడిటిని చూసాను. “స్పర్శ్”, “కథా”, “చష్మ్-ఎ-బద్దూర్” మూడూ చాలా మంచి సినిమాలు. ఎనభైల్లో నాకు పారలల్ సినిమా మీద బాగా మోజు ఉండేది. ఇప్పుడూ ఆ మోజు అలాగే వుంది, అయితే పారలల్ సినిమాలు రావటం లేదు ఎక్కువగా. అది వేరే సంగతి.
సిద్దార్థ్ (ఫరూఖ్ షైఖ్), ఓమీ (రాకేశ్ బేడీ), జయ్(రవీ బస్వానీ) ముగ్గురూ డిల్లీలో చదువుకునే విద్యార్థులు. సిద్దార్థ్ “రాముడు మంచి బాలుడు” టైపయితే, ఓమీ, జయ్ ఈ కాలం సినిమా హీరోల్లాగన్నమాట. ఒక నాడు ఓమీ జయ్ లిద్దరూ వాళ్ళ కాలనీలోకి వచ్చిన నేహా (దీప్తీ నవల్) అనే అమ్మాయిని చూస్తారు. ఇద్దరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ అమ్మాయికి లైనేయాలని ప్రయత్నించి పళ్ళు రాల కొట్టించుకొని వస్తారు. అయితే వాళ్ళసాహసం గురించి మాత్రం చిలవలూ పలవలూ నేసి చెప్పుకుంటారు.
అనుకోకుండా నేహా ఒకరోజు “చంకో” అనే వాషింగ్ పవుడరు అమ్మటానికి వాళ్ళింటికొస్తుంది. ఆమెని చూసి ఓమీ, జయ్ లిద్దరూ పారిపోయేసరికి ఇంట్లో వున్న సిద్దార్థ్ తోనే ఆమె మాట్లాడుతుంది. అలా మొదలైన పరిచయం స్నేహం, తరువాత ప్రేమలోకీ దిగుతాయి. మంచి చదువు చదువుకున్న సిధ్ధార్థ్ కి త్వరలోనే ఉద్యోగం దిరుకుతుంది, అదీ నేహా వాళ్ళ నాన్న గారి ఆఫీసులోనే. ఉద్యోగం దొరకగానే నేహా దగ్గర పెళ్ళి ప్రస్తావన తెస్తాడు సిధ్ధార్థ్. సిగ్గు పడ్డ నేహా తన తండ్రిని కలవమంటుంది.
అదేరోజు వాళ్ళ్ద్దర్నీ పార్కులో చూసిన జయ్, ఓమీలిద్దరూ ఈర్ష్య పడతారు. పైగా తమని ఆమె చూసిందంటే తమ బండారమూ బయట పడుతుందని భయ పడతారు. అందుకే ఇద్దరూ నేహా మీద ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పి అతని మనసు విరిచేస్తారు. దానికి తోడు వాళ్ళ ఆరోపణలకి యాదృఛ్ఛికంగా దొరికిన ఋజువులు కూడా చూపేసరికి సిధ్ధార్థ్ కలవరపడతాడు. నేహా తో పోట్లాడి సంబంధం కేన్సిల్ చేసుకొని ఇంటికొస్తాడు. కానీ అతని నిరాశ చూసిన స్నేహితులిద్దరూ పశ్చాత్తాప పడతారు. ఇద్దర్నీ కలిపే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాతేమైందో గెస్ చేయటానికి పెద్ద కష్టపడక్కర్లేదు.
ఎందుకో ఎన్నో ప్రేమకథలని చూసినా ఈ సినిమా కథంటే నాకు చాలా ఇష్టం. చాలా సరళంగా మధ్య తరగతి అమ్మాయిలూ-అబ్బాయిలకి ఎనభైల్లో వున్న ఐడియలిజాన్నీ, సింప్లిసిటీనీ, నిజాయితీని చాలా చక్కగా చిత్రీకరించారు. ఇలాటి పాత్రలు చేయటం ఫరూఖ్ షైఖ్ కీ, దీప్తీ నవల్ కీ కొట్టిన పిండి. అప్పట్లో వాళ్ళిద్దరూ హిట్-పెయిర్. “సాథ్ సాథ్”, “రంగ్ బిరంగీ”, “కథా” “కిసీ సే నా కెహనా” లో కూడా ఇద్దరూ నటించారు. అన్నట్టు, “కథా” లో ఫరూఖ్ ప్రతి నాయకుడు! ఆ సినిమాలో హీరో నసీరుద్దిన్ షా! ఇన్ని సినిమాల్లోకంటే ఫరూఖ్ నటన “బాజార్”, “గమన్” లో బెస్టు! ఎందుకో చిత్రరంగం ఇంత ప్రతిభ కల నటుణ్ణి ఎక్కువగా ఉపయోగించుకోలేక పోయింది. దీప్తి నవల్ గురించి చెప్పేదేముంది. ఆమె నవ్వూ, కళ్ళూ, ముఖ కవళికలూ చెప్పలేనంత అమాయకంగా బాగుంటాయి.
“కావాలనే నేను వెళ్ళే సంగీతం క్లాసు గురించి నీకు చెప్పాను” అని చిలిపితనంతొ కూడిన అమాయకత్వంతో అన్నప్పుడు బలే ముద్దొస్తుంది!
ఈ సినిమాకి ఇంకో హైలైటు రాజ్ కమల్ దర్శకత్వంలోని రెండు పాటలు! మిగతా పాటలు మామూలుగానే వున్నా, మధ్-మా-సారంగ్ (మధ్యమావతి) లో స్వర పర్చిన “కహా సే అయే బద్రా” చాలా హిట్టయింది. “కాలే ఘోడే ద్వార్ ఖడే” పాట రాగ (రాగ మాలిక) పరంగానూ, చిత్రీకరణ పరంగానూ చాలా బాగుంటుంది.
సినిమా అంతా యూ-ట్యూబు లో వుంది. టైము దొరికినప్పుడు తప్పక చూడొచ్చు.
@రాంపీ గారూ,
జేసుదాస్ పాడిన పాటలు చాలా వరకూ బాగుంటాయనిపిస్తుందండీ!
@జయ గారూ,
ధన్యవాదాలు
@కవిత గారూ
హి హి హీ! ఈ మధ్య యూ ట్యూబు లో నేను పాత సినిమాలు చాలా చూస్తున్నానండీ! అదన్నమాట.
శారద
జేస్ దాస్ హిందీ పాటలంటే పడి ఉన్న పళాన చచ్చిపోయే నాకు ఈ రెండు పాటలంటే కూడా చాలా ఇష్టం. రెంటిలోనూ కాలీ ఘోడే ద్వార్ ఖడీ! రాగమాలిక లు బాగా నచ్చుతాయి నాకు!
కొన్నాళ్ళయ్యాక ఈ క్లాసిక్స్ అన్నీ ఒక మూల పారేస్తారేమో అనే భయంతో ఇటీవలే ఫరూక్ షేక్ సినిమాలు,అమోల్ పాలేకర్ సినిమాలు ఇవన్నీ వెదికి వెదికి కొని పెట్టుకుంటున్నాను.
సుజాత గారూ, శైలజ గారూ,
టపా చదివి మీ ఆలోచనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
శాస్త్రీయ సంగీతమూ, లలిత సంగీతమూ, రెండూ దేనికవే ఆథెంటిక్ గా పాడటం ఒక్క జేసుదాస్ మాత్రమే చేయగలరు. వయొలీన్ చక్రవర్తీ-జోగ్ రాగమూ అన్న టపాలో, ఆయనదొక మళయాళం పాట లింకు పెట్టాను, వీలైతే వినండి. మళయాళం సినిమాల్లో ఎంత మామూలు సినిమా అయినా పాటలు అంత అద్బుతంగా ఎలా వుంటాయో నాఖైతే ఎప్పటికీ అర్ధం కాని ఒక మిస్టరీ!
శారద
ఎప్పుడూ ఆ పాట (కహా సె ఆయె) వింటూ ఉంటాను. మీ పోస్ట్ బాగా నచ్చింది.
చస్మే బద్దూర్ సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమానే. చాలా మంచి సినిమా గుర్తు చేసారు.
cinema antha you tube lo vundi ani chivarna rasindi naa kosame gadandee?
@రాంపీ గారూ,
జేసుదాస్ పాడిన పాటలు చాలా వరకూ బాగుంటాయనిపిస్తుందండీ!
@జయ గారూ,
ధన్యవాదాలు
@కవిత గారూ
హి హి హీ! ఈ మధ్య యూ ట్యూబు లో నేను పాత సినిమాలు చాలా చూస్తున్నానండీ! అదన్నమాట.
శారద
జేస్ దాస్ హిందీ పాటలంటే పడి ఉన్న పళాన చచ్చిపోయే నాకు ఈ రెండు పాటలంటే కూడా చాలా ఇష్టం. రెంటిలోనూ కాలీ ఘోడే ద్వార్ ఖడీ! రాగమాలిక లు బాగా నచ్చుతాయి నాకు!
కొన్నాళ్ళయ్యాక ఈ క్లాసిక్స్ అన్నీ ఒక మూల పారేస్తారేమో అనే భయంతో ఇటీవలే ఫరూక్ షేక్ సినిమాలు,అమోల్ పాలేకర్ సినిమాలు ఇవన్నీ వెదికి వెదికి కొని పెట్టుకుంటున్నాను.
దీప్తి నావల్ కళ్ళు చాలా చాలా బావుంటాయి.
ఈ పోస్ట్ ఎప్పుడో చదివాను, బాగా నచ్చింది. మీ ఆలోచనలు ఇంకానూ…
“కహా సే ఆయే” పాట లో అమ్మాయి మధ్యలో పాట వెనక పడితే, జేసుదాస్ పాడమని అని గుర్తు చేస్తు.. నాకు ఆయన గొంతు చాలా ఇష్టం.
Chandu. S
సుజాత గారూ, శైలజ గారూ,
టపా చదివి మీ ఆలోచనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
శాస్త్రీయ సంగీతమూ, లలిత సంగీతమూ, రెండూ దేనికవే ఆథెంటిక్ గా పాడటం ఒక్క జేసుదాస్ మాత్రమే చేయగలరు. వయొలీన్ చక్రవర్తీ-జోగ్ రాగమూ అన్న టపాలో, ఆయనదొక మళయాళం పాట లింకు పెట్టాను, వీలైతే వినండి. మళయాళం సినిమాల్లో ఎంత మామూలు సినిమా అయినా పాటలు అంత అద్బుతంగా ఎలా వుంటాయో నాఖైతే ఎప్పటికీ అర్ధం కాని ఒక మిస్టరీ!
శారద