మురళీకి ఎప్పణ్ణించో మంచి సంగీతాన్నీ, గుండెలోతుల్లోంచి భక్తినీ రంగరించి ఒక కచేరీ ఇవాలని ఆశ. అది నిన్న కృష్ణాష్టమి రోజు తీరింది.
నిన్న రాత్రి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఒక కచేరీ చేయమని మమ్మల్ని అడిగారు. అయితే మధుకి పరీక్షలు దగ్గరకొస్తున్నాయని నన్నూ మధూని వదిలేసి మురళీ అనన్యా రాత్రి పదింటినించి పదకొండింటి వరకూ కచేరీ చేసారు.
మురళీ ముందుగా “అహిర్ భైరవ్” (చక్రవాకం) లో పండిత్ జస్రాజ్ పాడిన “ఆజ్ తో ఆనంద్” పాట వాయించారు. ఆయన రాగంలో సంచారం చేసి వచ్చిన ప్రతీ సారీ అను పల్లవి ఎత్తుకుని పాటకి ఒక భజన ఫీలింగ్ తెచ్చింది.
తరువాత మురళీ యమున కల్యాణి లో “కృష్ణా నీ బేగనే బారో” వాయించారు. అప్పుడు అను అందుకుని దేశ్ రాగంలో “హే గోవింద హే గోపాల” అనే సూర్ దాస్ భాజన పాడింది. మురళీ ఒక మీరా భజన, “ష్యాం తేరీ బన్సీ” అనే సినిమా పాటా, “మోరె కాన్హా జో ఆయే పలట్ కే” అనే హోరీ పాటా వాయించారు. మళ్ళీ అను “ఎన్న తవం సైదనై యశోదా” అనే పాట కాఫీ రాగంలో పాడింది.
ఆఖర్న ఇద్దరూ కలిసి మహా మంత్రం పాడి/వాయించారు. మురళీ మహా మంత్రాన్ని సింపుల్ గా మార్వా రాగం లో ఆలాపన చేస్తూ వాయించారు. ఆలాపన ముగిసి ప్రతీ సారీ మహా మంత్రం పాడుతూ అనూ గొంతు కలిపింది. నిన్న రాత్రి భక్తులంతా అనూతో గొంతు కలిపి మహా మంత్రం పాడటం గొప్ప అనుభూతి. చివరికొచ్చేసరికి ఒక భక్తుడు నేల మీద మోకాళ్ళ మీద కూర్చుని,
“ప్రభూ! మళ్ళీ మహా మంత్రం వాయించండి!” అని అడిగారు. అనూ అయితే ఆ అనుభవానికి పరవశించి పోయింది! తబ్లా మీద కిరణ్ మండ్పే చాలా రక్తి కట్టించారు. ఇద్దరూ కలిసి అన్ని పాటలకీ ఇంగ్లీషు అనువాదాలతో, మంచి మంచి బొమ్మలతో పవర్ పాయింట్ తయారు చేసి కచేరీ జరుగుతున్నంత సేపూ వెనక స్క్రీన్ మీద ప్రొజెక్టు చేసారు.
కార్యక్రమం ముగిసి ఇద్దరూ రాత్రి పన్నెండింటికి వెలిగి పోతున్న మొహాలతో ఇంటికొచ్చారు! రెండో పదో రోజులకి నా దగ్గరికి వీడియో రికార్డింగ్ వస్తుంది. వచ్చినప్పుడు యూట్యూబు లో పెడతాను. అంతవరకూ వీలైతే ఈ మురళీ గానం వినండి.
వాసు గారూ,
ఆ వేణు వాదన మా శ్రీవారు మురళీధరన్ గారిదండీ. రెండేళ్ళ కింద ఆయన “ఇన్నర్ పీస్” అనే సీడీ విడుదల చేసారు. దాన్లోని ముక్కే ఆ యూట్యూబ్ లింకు.
ధన్యవాదాలు.
శారద
Beautiful. God bless them .. and you and Madhu too 🙂
మురళీ గానం అద్భుతంగా ఉంది . ఎవరిదీ? ఎక్కడికో వెళ్లి పోయినట్టు ఉంది.
వాసు గారూ,
ఆ వేణు వాదన మా శ్రీవారు మురళీధరన్ గారిదండీ. రెండేళ్ళ కింద ఆయన “ఇన్నర్ పీస్” అనే సీడీ విడుదల చేసారు. దాన్లోని ముక్కే ఆ యూట్యూబ్ లింకు.
ధన్యవాదాలు.
శారద
పండగల గురించి మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
http://www.samputi.com/launch.php?m=home&l=te