లాస్ ఎంజెలెస్
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మూడు మిలియన్ల పైగా జనాభా తో న్యూ యార్క్ తరవాత జనాభా దృష్ట్యా రెండో పెద్ద నగరం, లాస్ ఎంజెలెస్ . ఒకప్పుడు ఈ నగరం మెక్సికోకి చెందిందై ఉండేదట. పంతొమ్మిదో శతాబ్దంలో మెక్సికో తో యుధ్ధం ముగిసిన తరువాత అమెరికా భూభాగంలో కలిసిపోయింది.
హాలీవుడ్ సినిమా నటులూ, వారిని గారాబం చేయటానికి డాక్టర్లూ, వాళ్ళ ఆస్తి వ్యవహారాలు చక్కబెట్టటానికి వుండే లాయర్లతో వుండే బెవర్లీ హిల్స్ ఒక వంకా, ఆర్ధిక వ్యవస్థలో అట్టడుగున వుంటూ, ఊహించలేని క్రైం రేట్ తో నిత్యం పోలీసు పెట్రోలింగ్ కింద వుండే సౌత్ సెంట్రల్ ఎల్.ఏ. ఒకవైపూ వుండి, కొంచెం ముంబై లాగనిపిస్తుంది. విచిత్రంగాముంబై , ఎల్.ఎ. “సిస్టర్ సిటీస్”. 1992 లో శ్వేత జాతీయులూ- ఆఫ్రికన్ అమెరికన్లకూ మధ్య సంఘర్షణల వల్ల ప్రపంచ వార్తల్లోకెక్కిందీ నగరం. .
తిండీ, గుడ్డా తరవాత మనుషులక్కావలిసింది సినిమాలే కాబట్టి అన్ని దేశాల్లోలాగానే (ఇంకా మాట్లాడితే అన్ని దేశాలకంటే ఎక్కువగానే) అమెరికా ఆర్ధిక వ్యవస్థకీ సినిమాలకీ అవినాభావ సంబంధం వుంది. అమెరికా సినిమాల పుట్టిల్లు హాలీవుడ్ వల్లనే లాస్ ఏంజెలెస్ కి ఆ తళుకూ, ఆ పవరూ వచ్చాయనటంలో అతిశయోక్తి లేదు.
వ్యాపారానికీ, కళలకీ, సినిమాలకీ, తారలకీ, ఆస్కార్ అవార్డుల కే కాదూ, ఈ నగరం యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా, లాస్ ఏంజెలెస్ (యూ. సి. ఎల్.ఏ), లాస్ ఎంజెలెస్ ఫిలిం స్కూల్ కీ ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. 1932, 1984 లో ఇక్కడ ఒలింపిక్ పోటీలు జరిగాయి.
లాస్ ఏంజెలెస్ లో చూడ తగ్గ ప్రదేశాలు బోలెడు.
యూనివర్సల్ స్టుడియో-
స్వతహాగా ఇంగ్లీషు సినిమాలు చూసే అలవాటు ఎక్కువగా వుండడం వల్ల మాకందరికీ యూనివర్సల్ స్టుడియో టూరు చాలా నచ్చింది. హైదరాబాదులో మన రామోజీ ఫిలిం సిటీ లాటిదే యూనివర్సల్ స్టూడియో. అయితే చాలా పెద్దదీ, పాతదీ.
అమెరికాలో సినిమాల నిర్మాణమంతా పెద్ద పెద్ద స్టూడియోల ఆధ్వర్యంలో జరుగుతుంది. పేరమౌంట్ పిక్చర్స్ తరవాత అతి పెద్ద సినిమా కంపెనీ యూనివర్సల్ పిక్చర్స్ (యూనివర్సల్ స్టూడియోస్). 1962 లో యూనివర్సల్ పిక్చర్స్ ని మ్యూజి కార్పొరేషన్ ఆఫ్ అమెరికా కొనుగోలు చేసింది. అప్పుడే యూనివర్సల్ స్టూడియో టూర్ ప్రధాన ఆకర్షణగా ఒక థీం పార్క్ లాటి దాన్ని నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది.
ముందుగా సినిమా నిర్మాణంలో చిన్న చిన్న వింతలూ విశేషాలూ చూపించే ఈ టూర్ ఆలోచన తొందరలోనే పుంజుకుంది. యూనివర్సల్ స్టూడియో థీం పార్కునీ, పరిసర ప్రాంతాలనీ “యూనివర్సల్ సిటీ” గా ప్రకటించుకొంది. ఈ నగరానికొక పిన్ కోడ్ నంబరు కూడా వుంది. థీం పార్కుతోపాటు ఈ నగరంలో యూనివర్సల్, ఎన్.బీ.సీ ల ఆఫీసు భవనాలు, గిబ్సన్ థియేటరూ, ఒక పోలీసు స్టేషనూ, ఇంకా ఇతర ఆకర్షణలూ వున్నాయి.
పార్కులో కెళ్ళగానే ముందస్తుగా మార్లిన్ మన్రో స్వాగతం చెప్పింది! మన్రోనే కాదు, జార్జి క్లూనీ, డ్రాకులా, ష్రెక్ పాత్రలూ, అందరూ పలకరిస్తారు. అవేమో కానీ, నాకు స్టూడియో టూరూ, సినెమాటొగ్రఫీ భాగమూ చాలా నచ్చాయి.
చిన్న ట్రాములో సాగే టూరు లో సినిమా షూటింగులని వివరిస్తూ పాప్యులర్ సినిమాలు షూట్ చేసిన ప్రదేశాలు చూపిస్తూ, ట్రిక్కీ సన్నివేశాల్ని చిత్రీకరించడాన్ని వివరిస్తూ సాగుతుంది. “సైకో” తీసిన బేట్స్ మోటెల్ నీ,
“వార్ ఆఫ్ వర్ల్డ్స్” తీసిన విమానాన్నీ, కారులు గుద్దుకునే సన్నివేశాల్నీ అన్నీ చాలా ఆసక్తిగా చూసాము. ఒక చిన్న ఎడ్వెంచర్ రైడ్ కూడా వుంది మధ్యలో.
బేట్స్ మోటెల్ ట్రాములోంచి
స్పీల్బర్గ్ తీసిన వార్ ఆఫ్ వర్ల్డ్స్ సెట్టు
ఒక విషయం నాకు విచిత్రంగా అనిపించింది. “హాలీవుడ్” అన్నది నిజానికి ఒక సబర్బ్ పేరు. ఆకు పచ్చని కొండ మీద తెల్లటి పెద్ద అక్షరాలతో మనక్కడే “హాలీవుడ్” అన్న పేరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అక్కడ స్థలాల అమ్మకం కోసం పెట్టిందిట. ముందుగా సన్సెట్ బొలెవార్డ్ లో మొదలైన సినిమాల నిర్మాణం దరిమిలా “హాలీవుడ్” డిస్ట్రిక్ట్ అంతటా విస్తరించి, హాలీవుడ్ అన్న మాట అమెరికన్ సినిమాకి పర్యాయపదంగా మారిపోయింది.
బెవర్లీ హిల్స్
మన బంజారా హిల్స్, జుబిలీ హిల్స్ లాటి ప్రదేశం. అక్కడ వూరికే రోడ్లమీద నడిచి, పెద్దలయిన వాళ్ళ యిళ్ళు చూసి తరించింతర్వాత మా డ్రైవరు మమ్మల్ని వెనిస్ బీచికి తీసికెళ్ళాడు, కాంట్రాస్టు కోసమన్నట్లు. డ్రగ్ జంకీలతో, కొంచెం వ్యత్యాసంగా వుండే వెనిస్ బీచిలో ఏదో అసౌకర్యంగా అనిపించి ఎక్కువ సమయం గడపలేదు.
“డబ్బున్న వాళ్ళంటే మనకి ఎంత నమ్మకమో! బెవర్లీ హిల్స్ ఏరియాలో భయం లేకుండా నడిచాం. ఈ వెనిస్ బీచిలో బెరుగ్గా వున్నాం. వీ ట్రస్ట్ ఇన్ మనీ మోర్ దెన్ ఇన్ ది లా ఒర్ గాడ్,” అంటూ రెండు రోజులు సణిగింది మా మధు.
Chinna pillaina chaala baaga cheppindi Madhu. Quotation ga kudaa vadochcu tanu cheppina statement. Baavundi mee LA varnana.
“We trust in money more than in law or God”… how perfectly true.
చాల బాగా చెప్పింది అనే కంటే తన మనసు బాగా నోచ్చుకోంది అనచ్చు. మనలో వుండే వేరే
మనగురుంచి. తట్’స వాట్ వే అరె
That’s what we are…..
I feel very happy to read your artical.
This is the good Telugu Blog
mahender
http://www.pharmanaukri.info
Hyderabad India
కవిత గారూ, సునము గారూ, మణి గారూ,
చదివినందుకూ, వ్యాఖ్యానించినందుకూ ధన్యవాదాలు.
మా మధుకి కొంచెం డబ్బు, మానవసంబంధాలూ, మనుషుల్లో వుండే హిపోక్రసీ లాటి విషయాల గురించి ఆలోచించేటప్పుడు మనసు సున్నితం!
She argues they are all interrelated. Hence that observation from her.
శారద
rightly said madhu…