అందాల అడిలైడ్

 కిందటి వారం Lonely Planet  అడిలైడ్ ని తప్పక చూసి తీరాల్సిన పది నగరాల్లో ఒకటిగా పేర్కొంది.

————————-

మెల్బోర్న్, సిడ్నీ వాస్తవ్యులు ఎప్పుడూ చిన్న చూపు చుస్తారనీ, “బాక్ వాటర్స్” అని పిలుస్తారనీ అడిలైడ్ నివాసులకి కొంచెం బాధ. నిజంగానే, రాత్రి ఏడయ్యేసరికి మూసేసే దుకాణాలూ, దాదాపు 1.2 మిలియన్ల కంటే దాటని జనాభా, పెద్ద పెద్ద కంపెనీలూ-ఉద్యోగావకాశాలు లేని ఎకానమీ అన్నీ కలిపి అడిలైడ్ చిన్న పల్లెకి ఎక్కువా, పెద్ద టౌను కి తక్కువగా అనిపిస్తుంది.

“అడిలైడ్ లో ఏముంటుందబ్బా చూడడానికి?” అని మిగతా నగర వాసులు వేళాకోళం చేయడం కూడా తరచుగా వినబడుతుంది.

అదంతా గత చరిత్ర. కిందటి వారం Lonely Planet  అడిలైడ్ ని తప్పక చూసి తీరాల్సిన పది నగరాల్లో ఒకటిగా పేర్కొంది. ఒక్కసారిగా అడిలైడ్ పేరు ప్రతిష్టలూ, హోదా పెరిగిపోయాయి.

Lonely Planet సూచనల ప్రకారం 2014 లో చూసి తీరాల్సిన పది నగరాలూ

పారిస్ (ఫ్రాన్స్), ట్రినిడాడ్ (క్యూబా), కేప్ టవున్ (సౌత్ ఆఫ్రికా), రీగా (లాట్వియా), జూరిక్ (స్విట్జర్లాండు), షాంఘై (చైనా), వాంకూవర్ (కెనడా), షికాగో (అమెరికా), అడిలైడ్ (ఆస్ట్రేలియా), ఇంకా ఆక్లాండ్ (న్యూజీలాండ్).

అడిలైడ్ లో యాత్రికులకి చాలా నచ్చేది వాతావరణం ఒకటైతే, వైనరీలు రెండోది. నగరం చుట్టూ ఎకరాల కొద్దీ వ్యాపించి వున్న ద్రాక్ష తోటలూ, వైనరీలూ ఎకానమీ ని నడిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అడిలైడ్ యూనివర్సిటీ లో “వైన్ టేస్టింగ్” కూడా ఒక సబ్జెక్టు!

ఇండియా జట్టూ, ఆస్ట్రేలియా జట్టూ జుట్లూ జుట్లూ పట్టుకునే అడిలైడ్ ఓవల్, సర్ డాన్ బ్రాడ్మేన్ మ్యూజియమూ సరే సరి!

అందాల అడిలైడ్ గురించి కొన్ని విశేషాలు-

దాదాపు రెండు మిలియన్ల జనాభా వుండే సౌత్ ఆస్ట్రేలియా రాష్ట్ర రాజధాని అడిలైడ్. అడిలైడ్   జనాభా దాదాపు 1.2  మిలియన్లుంటుంది.  ఆస్ట్రేలియా ఖండానికి దక్షిణాన చిన్న పెనిన్సులా లా వుంటుంది. అనంతమైన జలనిధి ఒక వైపు, ఒద్దికగా వుండే అడిలైడ్ హిల్స్ ఒక వైపూ వుండి నగరాన్ని రక్షిస్తున్నట్టూ వుంటాయి. ఆ కొండలు దాటి ఇంకా ఉత్తరానికెళ్తే ఆస్ట్రేలియాన్ ఎడారికి మార్గం కనబడుతుంది.

వాతావరణం చలి కాలం (జూన్-జులై-ఆగస్టు) లో 2 డిగ్రీల సెల్సియస్ వరకూ వెళ్తే, ఎండాకాలం (డిసెంబరు-జనవరి-ఫిబ్రవరి) 42 డిగ్రీల సెల్సియస్ వరకూ వెళ్తుంది.

సిడ్నీ, మెల్బోర్న్ లాటి నగరాలు ఇంగ్లాండు/యూరోపు నించి వచ్చిన నేరస్థులు నిర్మించుకొన్నవి. ఒక్క అడిలైడ్ నగరం మాత్రమే బ్రిటిష్ ప్రభుత్వం పూనుకొని పక్కా మాపులతో తీర్చి దిద్దిన నగరం.అందుకే ఈ నగరానికి Convict History లేదు. పంజాబు లో వుండే ఛండీగఢ్ నగరం లా, కల్నల్ లైట్స్ అడిలైడ్ నగరాన్ని గ్రిడ్ లా రూపొందించారు. అన్నట్టు,  బ్రిటిష్ మహారాజు కింగ్ విలియం IV భార్య ‘అడిలైడ్’ పేరునే ఈ నగరానికిచ్చారు.

అందమైన చెట్లతో వుండే పుర వీథులూ, వచ్చీ పోయే జనం తో కళ కళ లాడే నగర కూడలీ, దూరంగా సబర్బ్స్లో కెళుతూ వుంటే ప్రశాంతంగా వుండే కాలనీలూ, ఏ మాత్రం జన సమ్మర్ధం లేని జీవిత శైలీ బాగుంటుందని వేరే చెప్పాలా? అవే కాక, ఇంకా అడిలైడ్ లో వుండే అంద చందాలు కొన్ని-

1. నార్త్ టెరేస్:నగరం లోని ప్రధాన వీధి. ఒక వైపు సౌత్ టెరేస్, ఒక వైపు ఈస్ట్ టెరేస్, ఇంకోక వైపు వెస్ట్ టెరేస్  తో కలిసి ఒక పెద్ద చతురస్రాకారం నగర కూడలి.

Image

Image

2. యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్ :సర్ విలియం బ్రాగ్ తో సహా అయిదుగురు నోబెల్ గ్రహీతలనందించిన యూనివర్సిటీ.

Image

3. టారెన్స్ నది:

Torrens

Image

4.ఆర్ట్ గాలరీ: చాలా వరకు మల్టీ కల్చరలిజం ని ప్రోత్సహించడానికి దేశ దేశాల కళలకు వేదిక. ఇక్కడ చాలా భారతీయ సంగీత కచేరీలు (free concerts) జరుగుతాయి. వచ్చే యేడాది జనవరి 25 న మురళీ ఇక్కడ కచేరీ చేయబోతున్నారు. ప్రస్తుతం Realms of Wonder పేరిట పెద్ద భారతీయ చిత్ర కళా ప్రదర్శన జరుగుతూంది.

ArtGallery

5.బరోసా వాలీ : రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకి పునాది అయిన ద్రాక్ష తోటలకూ, వైనరీలకూ ప్రసిధ్ది. ఇక్కడ ప్రతీ యేడూ జాజ్ మ్యూజిక్ ఫెస్టివల్స్ కూడా జరుగుతాయి.

ఇంకా ఆర్ట్ గేలరీలకూ, రకరకాల మ్యూజియం లకూ అయితే లేక్కే లేదు.ఈ చూడ దగ్గ ప్రదేశాలతో పాటూ మా అడిలైడ్ కి ఇంకో ప్రత్యేకత కూడా వుంది!

సౌత్ ఆస్ట్రేలియాని ‘ఫెస్టివల్ స్టేట్’ అని పిలుస్తారు. మార్చి నెలలో  WOMADelaide, Writers festival, Adelaide Cabaret festival  ఇంకా లెక్కలేనన్ని festivals వుంటాయి. అందుకే మార్చి నెలని mad March  అని కూడా పిలుస్తారు. నా వరకు నాకు WOMADelaide  చాలా నచ్చుతుంది. టిక్కెట్లు డెభ్భై అయిదు నించీ,వంద డాలర్ల వరకూ వుంటుంది, కానీ రోజంతా అక్కడే వుండొచ్చు. అన్ని ప్రపంచ దేశాలకి సంబంధించిన సంగీతాన్నీ వినొచ్చు. WOMADelaide అంటే World Music in Adelaide.

WOMAD

అలాగే writers festival  లో ఒకసారి ఆంగ్ల రచయిత్రి శశీ దేశ్ పాండే తో కలిసి డిన్నర్ చేస్తే, ఇంకొక సారి నోబెల్ బహుమతి గ్రహీత కోట్జీ ని చూడగలిగాను. అన్నట్టు, సౌత్ ఆఫ్రికాకి చెందిన ఆయన, అన్ని ప్రదేశాలకంటే అడిలైడ్ నచ్చిందని, ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకొన్నారు.

అన్నిటికంటే అడిలైడ్ లో నచ్చే విషయం- స్నేహ శీలులైన పౌరులు. ఆఫీసుకి వెళ్ళే టైమవుతున్నా, చచ్చేంత ట్రాఫిక్ జాములో చిక్కుకున్నా, నదిలోంచి తప్పి పోయి వచ్చిన బాతులు నార్త్ టెరేస్ రోడ్డు దాతి వెళ్ళేంతవరకూ కార్లు ఆపి వుండగలిగేది మా అడిలైడ్ పౌరులే అని ఘంటాపథంగా చెప్పగలను. (ఈ సంఘటన నిజంగా జరిగింది.)

6 thoughts on “అందాల అడిలైడ్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s