అడిలైడ్ నించి ఊరు మారి బ్రిస్బేన్ వచ్చి నాలుగేళ్ళ పైనే అయింది. బ్లాగుల్లో రాసుకోవడం మానేసీ దాదాపు మూడేళ్ళవుతుంది. ఈ రెండు సంఘటనలకీ ఎటువంటి సంబంధమూ లేదనీ, మొదటిది ఘటన అయితే రెండోది స్వయంకృతమనీ మనవి.
రోజువారీగా బ్రతుకు ఉతికి, ఆరేసి, గంజి పెట్టి, ఇస్త్రీ చేసి మడతలేస్తుంటే, కుక్కిన పేలలా పడుండడం తప్ప ఇంకోటి చేతకాని సన్నాసులం, మనకీ బ్లాగులూ, కథలూ రాతలూ అవసరమా మనసా, అనే వేదంతం కొంత, నెట్ఫ్లిక్సూ, అమెజాన్ లాటి వ్యసనాలు కొంత, అబ్బో మన బధ్ధకానికి పేర్లెన్నో.
అయితే నాకంటే బిజీ వృత్తులలో వుండే వాళ్ళు క్రమం తప్పకుండ మంచి విషయాలు రాస్తూ పంచుకోవడం చూస్తే కొంచెం సిగ్గేసిన మాటా నిజమే. సరే, వూరికే సిగ్గుపడి కూర్చుంటే ఏమీ ప్రయోజనం వుండదనిన్నీ, మానవ జాతి చరిత్ర పరిణామంలో ఒక మహత్తరమైన, ముందెన్నడూ ఎరుగని కాలాన్ని రికార్డు చేయకపోవడం తప్పనిన్నీ మళ్ళీ కలమూ/లేఖినీ చేతపట్టాను.
బ్రిస్బేన్ విశేషాలతో…రాదామన్న ఆశా, సంకల్పంతో…
బ్లాగుల్లోకి మళ్ళీ స్వాగతం అండీ.
Meeru cheppe sangatula kosam waiting mari 🙂
మీరున్న పడవలో చాలా మంది ఉన్నారు. దయచేసి వ్రాయండి.