నా గురించి

ప్రభుత్వ రంగ సంస్థలో పంచి చేస్తూ బ్రిస్బేన్ నగరం లో వుంటున్నాము. ఇంతకు ముందు అడిలైడ్ లో వుంటూ ఇష్టంగా రాసుకున్న బ్లాగూ, కథలూ కొంతకాలం మూత పడ్డాయి. ప్రస్తుతం వాటిని దుమ్ముదులిపే ప్రయత్నంలో వున్నాను.

17 thoughts on “నా గురించి

    • కవిత గారూ,
      కథ చదివి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

      ఈ కథలో రెండు విషయాలు చర్చకి వస్తాయి. సామాన్య జీవితంలో తీవ్రవాదానికి ఎలా స్పందిచాలన్నది ఒక కోణమైతే, నిజాయితీగా తాము నమ్మినదాన్ని ఆచరించే వాళ్ళని మనం ఎలా అర్ధం చేసుకుంటామన్నది రెండో కోణం.

      ఈ కథలో శ్రీనివాస్ ఎక్కువగా ఆలోచించేది దాని గురించే. హిపోక్రాట్లనీ, అబధ్ధాలాడేవాళ్ళనీ అర్ధం చేసుకుని క్షమించినంత తేలిగ్గా మనం నిజాయితీ పరులని అర్ధం చేసుకోం. ఈ సంగతి గ్రహించటానికే శ్రీనివాస్ కి అంత అంతర్మధన అవసరమైంది. అతనూ స్వతహాగా నిజాయితీ పరుడే కాబట్టి తన ఆలోచనల్లోని చిన్నతనానికి .సిగ్గుపడ్డాడు. ఒకసారి ఈ విషయం అర్ధం కాగానే అతనికి భార్య మీదున్న అసహనం పోయి ఎప్పుడూ వుండే ప్రేమాభిమానాలు బయటికొచ్చాయి.
      I hope I have answered your question.

  1. శారద గారికి, నమస్కారములు.

    మొట్టమొదటి సారిగా మీ బ్లాగుని చదువుతున్నాను. నేనుకూడా “హోమ్స్ ” వీరాభిమానినే. 1970 లో ఒకసారి, కంప్లీట్ వర్క్స్ ఆఫ్ షెర్లాక్ హొమ్స్ చదివాను. మళ్ళీ, 2009 లో పూర్తిగా ఆ పుస్తకాన్ని చదివాను. ఆయన కధలు చదివిన తరువాత, తప్పకుండా, ప్రతిఒక్కరిలో విశ్లేషణా గుణం; పరిశీలనా గుణం పెరుగుతుంది. మీ ఇతర రచనలను త్వరలోనే చదువుతాను.

    భవదీయుడు,
    మాధవరావు.

  2. నమస్తే శారద గారూ! మీరు నా లోకం లో చేసిన వ్యాఖ్యానం చూసి ఆసక్తి కోసం మీ ఈ బ్లాగ్ లోకి తొంగి చూసాను,ఇంకా చదవలేదు అనుకోండి. మీ బ్లాగ్ మీ చక్కని అభిరుచిని తెలియచేస్తుంది .మీ వంటి విజ్నులనుంచి వచ్చిన ప్రశంసను విలువయినదిగా భావిస్తున్నాను.తొందర్లో మీ బ్లాగ్ మీద నా అభిప్రాయం తెలియ చేస్తాను.కృతజ్ఞతలు.

    • సుభద్ర గారూ,
      మీ అభిమానానికి చాలా కృతఙ్ఞతలు.
      I hope to deserve your compliments. నేనూ పుస్తక ప్రచురణ గురించి ఆలోచిస్తున్నానండీ.
      Thanks again.
      శారద

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s