అయితే ఈ పోస్టు షెన్ గురించి కాదు, అనన్య గురించి అసలే కాదు. వరుణ్ లాల్ గురించి! అతని పట్టుదలా, పరిస్థితులకి తలవంచని ధైర్యమూ చూసి మనమందరమూ ఎంతైనా నేర్చుకోవల్సి వుంది. -------------------------------------------- బ్రిస్బేన్ నగరానికొచ్చి యేణ్ణర్థం కావొస్తుంది. మంచి వాతావరణం, అనువైన ఉద్యోగం, అంతా బాగుంది, దేవుడి దయవల్ల. బ్రిస్బేన్ నగరం లో సంగిత కార్యక్రమాలు ఎక్కవనే చెప్పాలి. వినడానికీ, పాల్గొనడానికీ చాలా అవకాశాలు దొరుకుతాయి. అయిటే, బ్రిస్బేన్ నగర విస్తీర్ణం వల్లా, ఇంకా అనేకానేక ఇతర … రిథం ఆఫ్ లైఫ్ని చదవడం కొనసాగించండి
రచయిత: శారద
ప్రస్థానం-అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ దాకా
పదిహేడేళ్ళ కాలం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఎనిమిది నెలల చిన్న పాపాయి మా అనూ , స్కూలు చదువు ముగించుకునేంత ! పదిహేడేళ్ళ కాలంలో మనం పెంచుకునే అనుబంధాలూ ఆప్యాయతలూ చిన్నవేమీ కావు. అవి వొదులుకొని దూరమవ్వాల్సినప్పుడు ఎంతో బాధ కలిగించేంత గాఢమైనవి. అందుకే పదిహేడేళ్ళు మమ్మల్ని కడుపులో పెట్టుకొన్న అడిలైడ్ నగరాన్నీ, మా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మమ్మల్ని గుండెల్లో దాచుకున్న స్నేహితులనీ వదిలి ఇంకో నగరానికి వెళ్ళాలన్న ఆలోచనే ఎంతో కష్టంగా … ప్రస్థానం-అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ దాకాని చదవడం కొనసాగించండి
ముదితల్ నేర్వగ రాని విద్య కలదే…
నోబెల్ బహుమతి గ్రహీతా, డెభ్భై రెండేళ్ళ శాస్త్రఙ్ఞుడూ, foot-in-the-mouth అనే వ్యాధి గ్రస్తుడూ అయిన టిం హంట్ (Tim Hunt)ని కలిసిన వారెవరైనా వున్నారా? నేను కలిసాను. ఒకసారి కాదు, బోలెడు సార్లు. అయితే, ఆయన నా జీవితంలోకి వచ్చినప్పుడల్లా వేర్వేరు వేషాలతోనూ, మారు పేర్ల తోనూ వుండేవాడు. ఎలాగంటారా? ఈ గుండ్రాల వెంట తిరుగుతూ మీరూ నాతో పాటు రండి. **** పాతికేళ్ళ కింద, ఎమ్మెస్సీ ఫిజిక్సు చదువుతూ మార్కుల కోసం యేడుస్తూ, సెంట్రల్ యూనివర్సిటీ … ముదితల్ నేర్వగ రాని విద్య కలదే…ని చదవడం కొనసాగించండి
మంత్రగత్తెలో మాతృత్వం
దాదాపు పదహారేళ్ళ కింద మా ఇంటిల్లిపాదికీ చిన్నపిల్లల సినిమాలూ, అనిమేటెడ్ సినిమాలూ అలవాటయ్యాయి. ఆ అలవాటునించి పిల్లలు పెద్దయి బయటపడ్డా మేమిద్దరం చాలా పిల్లల సినిమాలు చూస్తూనే వుంటాం. పిల్లల సినిమాలూ- అనిమేటెడ్ సినిమాల ధర్మమా అని మాకు ఫెయిరీ టేల్స్ అన్నీ బాగా తెలిసిపోయాయి. మునుపు ఇవన్నీ ఒకేలాగుండేవి. ఆపదల్లో వున్న అందమైన రాజకుమారిని అంతే అందగాడూ ధీరుడూ అయిన రాజకుమారుడో (లేదా ఇంకే వీరుడో) వచ్చి అమ్మాయిని రక్షించి, చేపట్టటమే కథ. (ఇప్పటికీ చాలా సినిమాలు … మంత్రగత్తెలో మాతృత్వంని చదవడం కొనసాగించండి
బంగారానికి మెరుగు
ఎంత అందమైన బంగారు నగైనా మెరుగు పెడితేనే మెరుపొచ్చేది. ఎంత విలువైన వజ్రానికైనా సాన పెడితేనే ప్రకాశించేది. ఎంత అద్భుతమైన కళాకారుడైనా చెమటోడ్చి సాధన చేస్తేనే కళావిష్కరణ జరిగేది. అసలు కళాకారుడికి వచ్చే విలువా గుర్తింపూ కేవలం అతని జన్మ సంజాతమైన కళ వల్లేనా, లేక మిగతా హంగులవల్లనా అన్నది కూడా ప్రశ్నే. బంగారు పళ్ళేనికైనా గోడ అవసరమే కదా? మంచి చిత్రాన్ని మంచి ఫ్రేములో పెట్టకుంటే ఎవరూ గుర్తించరా? ఈ ప్రశ్నకి సమాధానం కోసం ఆ … బంగారానికి మెరుగుని చదవడం కొనసాగించండి
నీలాంబరి-సమీక్ష
నీలాంబరి కథల పుస్తకంపై జులై నెల రచనలో వచ్చిన సమీక్ష. నా పట్ల ఆదరాభిమానాలూ, నా కథా రచన పట్ల నమ్మకమూ కలబోసి ఇంత లోతైన విశ్లేషణ రాసిన వసుంధర దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు. నీలాంబరి సమీక్ష
చేజారిన స్వర్గం
కొన్నిపుస్తకాలు మొదటిసారి చదివినప్పుడు మనకేమాత్రం నచ్చవు. ఏమిటీ చెత్తా అనిపిస్తుంది కూడా. కానీ అదే పుస్తకాన్ని కొన్నేళ్ళ తరవాత చదివితే కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. అప్పుడు, "ఈ పుస్తకం నేననుకున్నంత చెత్తగా లేదేమో" అనిపిస్తుంది. ఇంకా కొన్నేళ్ళు పోయాక చదివితే, "ఇంత మంచి పుస్తకం నాకెందుకు నచ్చలేదబ్బా!" అని కూడా అనిపిస్తుంది. పెరుగుతున్న వయసుతో పాటు మన ఆలోచనల్లో వస్తున్న మార్పులకీ, మనం ఇతర్ల ఆలోచనలూ అభిప్రాయాలూ గుర్తించి గౌరవించడం నేర్చుకుంటున్నామన్న విషయానికీ ఇంతకంటే పెద్ద ఋజువేమీ … చేజారిన స్వర్గంని చదవడం కొనసాగించండి
నీలాంబరి- కథల పుస్తకం
దాదాపు రెండేళ్ళ క్రితం, అంటే డిసంబరు 2011 ప్రాంతంలో నేనింతవరకూ రాసినవీ, అక్కడక్కడా పత్రికల్లో వచ్చినవీ కొన్ని కథలతో ఒక సంకలనం వేయిస్తే మంచిదేమో అన్న ఆలోచన వచ్చింది. మా కుటుంబ సభ్యులూ, శ్రేయోభిలాషి శ్రీ సురేశ్ కొలిచాల గారి ప్రోత్సాహంతో కథల ఎడిటింగ్ మొదలు పెట్టాను. ఆ పనిలో తల మునకలుగా వుండగానే హైదరాబాదులో మా అమ్మగారు అస్వస్థులవడం జరిగింది. ఆ తర్వాత ఒక ఏడెనిమిది నెలలు ఇంకే విషయం గురించీ ఆలోచించలేని ఒకలాటి మానసిక … నీలాంబరి- కథల పుస్తకంని చదవడం కొనసాగించండి
శ్రీప ప్రియ సంగీతోపాసన……..
మా ఊళ్ళో శృతి-అడిలైడ్ సంస్థ అధ్వర్యం లో యేడాదికి రెండు లేదా మూడు కచేరీలు వుంటాయి. ఈ కచేరీలు చేసే కళాకారులు మెల్బోర్న్ సిడ్నీలకొచ్చే భారతీయ కళాకారులై వుంటారు. అయితే రెండు మూడేళ్ళుగా ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ కళాకారులని కూడా పిలవడం అప్పుడప్పుడూ జరుగుతూంది. మెల్బోర్న్ వాస్తవ్యులు శ్రీ మురళీ కుమార్ గారి వయోలీన్ కచేరీ, సీడ్నీలో సంగీత పాఠశాల నడుపుతూన్న శ్రీమతి భవాని గోవిందన్ గారి కచేరీ, బ్రిస్బేన్ గాయనీ మణి శ్రీమతి సుష్మితా రవి … శ్రీప ప్రియ సంగీతోపాసన……..ని చదవడం కొనసాగించండి
అందాల అడిలైడ్
కిందటి వారం Lonely Planet అడిలైడ్ ని తప్పక చూసి తీరాల్సిన పది నగరాల్లో ఒకటిగా పేర్కొంది. ------------------------- మెల్బోర్న్, సిడ్నీ వాస్తవ్యులు ఎప్పుడూ చిన్న చూపు చుస్తారనీ, "బాక్ వాటర్స్" అని పిలుస్తారనీ అడిలైడ్ నివాసులకి కొంచెం బాధ. నిజంగానే, రాత్రి ఏడయ్యేసరికి మూసేసే దుకాణాలూ, దాదాపు 1.2 మిలియన్ల కంటే దాటని జనాభా, పెద్ద పెద్ద కంపెనీలూ-ఉద్యోగావకాశాలు లేని ఎకానమీ అన్నీ కలిపి అడిలైడ్ చిన్న పల్లెకి ఎక్కువా, పెద్ద టౌను కి తక్కువగా … అందాల అడిలైడ్ని చదవడం కొనసాగించండి