ప్రస్థానం-అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ దాకా

పదిహేడేళ్ళ కాలం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఎనిమిది నెలల చిన్న పాపాయి మా అనూ , స్కూలు చదువు ముగించుకునేంత ! పదిహేడేళ్ళ కాలంలో మనం పెంచుకునే అనుబంధాలూ ఆప్యాయతలూ చిన్నవేమీ కావు. అవి వొదులుకొని దూరమవ్వాల్సినప్పుడు ఎంతో బాధ కలిగించేంత గాఢమైనవి. అందుకే పదిహేడేళ్ళు మమ్మల్ని కడుపులో పెట్టుకొన్న అడిలైడ్ నగరాన్నీ, మా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మమ్మల్ని గుండెల్లో దాచుకున్న స్నేహితులనీ వదిలి ఇంకో నగరానికి వెళ్ళాలన్న ఆలోచనే ఎంతో కష్టంగా … ప్రస్థానం-అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ దాకాని చదవడం కొనసాగించండి

నీలాంబరి- కథల పుస్తకం

దాదాపు రెండేళ్ళ క్రితం, అంటే డిసంబరు 2011 ప్రాంతంలో నేనింతవరకూ రాసినవీ, అక్కడక్కడా పత్రికల్లో వచ్చినవీ కొన్ని కథలతో ఒక సంకలనం వేయిస్తే మంచిదేమో అన్న ఆలోచన వచ్చింది. మా కుటుంబ సభ్యులూ, శ్రేయోభిలాషి శ్రీ సురేశ్ కొలిచాల గారి ప్రోత్సాహంతో కథల ఎడిటింగ్ మొదలు పెట్టాను. ఆ పనిలో తల మునకలుగా వుండగానే హైదరాబాదులో మా అమ్మగారు అస్వస్థులవడం జరిగింది. ఆ తర్వాత ఒక ఏడెనిమిది నెలలు ఇంకే విషయం గురించీ ఆలోచించలేని ఒకలాటి మానసిక … నీలాంబరి- కథల పుస్తకంని చదవడం కొనసాగించండి

శ్రీప ప్రియ సంగీతోపాసన……..

మా ఊళ్ళో శృతి-అడిలైడ్ సంస్థ అధ్వర్యం లో యేడాదికి రెండు లేదా మూడు కచేరీలు వుంటాయి. ఈ కచేరీలు చేసే కళాకారులు మెల్బోర్న్  సిడ్నీలకొచ్చే భారతీయ కళాకారులై వుంటారు. అయితే రెండు మూడేళ్ళుగా  ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ కళాకారులని కూడా పిలవడం అప్పుడప్పుడూ జరుగుతూంది. మెల్బోర్న్ వాస్తవ్యులు శ్రీ మురళీ కుమార్ గారి వయోలీన్ కచేరీ, సీడ్నీలో సంగీత పాఠశాల నడుపుతూన్న శ్రీమతి భవాని గోవిందన్ గారి కచేరీ, బ్రిస్బేన్ గాయనీ మణి శ్రీమతి సుష్మితా రవి … శ్రీప ప్రియ సంగీతోపాసన……..ని చదవడం కొనసాగించండి

అందాల అడిలైడ్

 కిందటి వారం Lonely Planet  అడిలైడ్ ని తప్పక చూసి తీరాల్సిన పది నగరాల్లో ఒకటిగా పేర్కొంది. ------------------------- మెల్బోర్న్, సిడ్నీ వాస్తవ్యులు ఎప్పుడూ చిన్న చూపు చుస్తారనీ, "బాక్ వాటర్స్" అని పిలుస్తారనీ అడిలైడ్ నివాసులకి కొంచెం బాధ. నిజంగానే, రాత్రి ఏడయ్యేసరికి మూసేసే దుకాణాలూ, దాదాపు 1.2 మిలియన్ల కంటే దాటని జనాభా, పెద్ద పెద్ద కంపెనీలూ-ఉద్యోగావకాశాలు లేని ఎకానమీ అన్నీ కలిపి అడిలైడ్ చిన్న పల్లెకి ఎక్కువా, పెద్ద టౌను కి తక్కువగా … అందాల అడిలైడ్ని చదవడం కొనసాగించండి

పరోపకారార్థం…..

చాలా రోజులుగా నేను నా ఇల్లు, నా పిల్లలూ, నా సంసారం, నా సంగీతం, నా రాతలు అంటూ నాకు మాత్రమే చోటున్న సెల్ఫ్- సెంట్రిక్ ప్రపంచంలో కొట్టుకుపోతూన్న భావన కలుగుతూంది నాకు. బహుశా ఎదుగుతున్న వయసులో వున్న పిల్లలూ, మన ఆప్యాయతా, అటెన్షనూ ఆశించే పెద్దవాళ్ళూ వున్న ఈ ఫేజ్ లో అందరికీ అంతే కాబోలు.  అయితే కొంచెం కళ్ళు తెరిచి నాకేమాత్రమూ సంబంధం లేని మనుషులకోసం కొంత సమయం కేటాయించాలని ఈ సంవత్సరం ఆరంభంలో … పరోపకారార్థం…..ని చదవడం కొనసాగించండి

యుగళ గీతం

సాధారణంగా శాస్త్రీయ సంగీత కచ్చేరీల్లో ఒక ప్రధాన పాత్రధారి వుంటారు. (గాయకులే కావొచ్చు, వాయిద్య కారులే కావొచ్చు). వారికి పక్క వత్తాసుగా ఇంకా వేరే వాద్యకారులూ, మృదంగ విద్వాంసులూ వుండడం సాధారణం. ఉత్తర భారతీయ సంప్రదాయమైన హిందుస్తానీ సంగీతంలో తబల వాయిద్యం, సుర్ బహార్ వాయిద్యం వుంటాయి. దక్షిణ భారతీయ సంప్రదాయమైన కర్ణాటక సంగీతంలో ముఖ్య విద్వాంసులకి తోడుగా, మృదంగ సహకారం, వయోలీన్ (కొన్నిసార్లు వేణువు) వాదనా వుంటాయి. కొన్నిసార్లు ఇద్దరు ముఖ్య కళాకారులతో కచేరీలు కూడా … యుగళ గీతంని చదవడం కొనసాగించండి

వికటించిన హాస్యం

హాస్యం చాలా సున్నితంగా వుండాలన్న విషయం అందరికీ తెలిసిందే. మాటలతో నైనా, చేతలతోనైనా ఎవరినైనా వుడికిస్తే, ఆ తర్వాత ఆ సంగతి ఎప్పుడు తలచుకున్నా నవ్వు రావాలి. "అతి సర్వత్ర వర్జయేత్" అన్న సూక్తి హాస్యానికి వర్తించినంతగా ఎక్కడా వర్తించదేమో. ఈ మధ్య నే జరిగిన నర్సు జసింతా సల్దానా విషాద ఉదంతం వింటే ఇదే అర్ధమవుతుంది. ప్రపంచమంతటా మీడియా చేసే అతి వికృత రూపాలు దాలుస్తుందేమో అన్న అనుమానం రాక మానదు ఈ ఉదంతాన్ని పరిశీలిస్తే. … వికటించిన హాస్యంని చదవడం కొనసాగించండి

వైద్యో నారాయణో హరిః

ప్రపంచమంతటా ఎక్కువగా గౌరవాన్ని పొందేది బహుశా వైద్య వృత్తి అనుకుంటా. ప్రతి ఒక్కరి జీవితం లో ఏదో విషమ సమస్యని వైద్య సహాయంతో తీర్చుకోవటం, సదరు డాక్టర్ని కృతఙ్ఞతతో తలచుకోవటం చాలా సాధారణం. వైద్యవృత్తితో డబ్బునీ గౌరవాన్నీ సంపాదించుకొనే డాక్టర్లని ఎంతో మందిని చూస్తాం. కానీ వైద్య వృత్తితో సేవా ధర్మాన్నీ, అందునా సమాజంలో వున్న అట్టడుగు ప్రజానీకానికి సేవ చేసే వైద్యులని చూడటం చాల ఇన్స్పైరింగ్ విషయం. ఆస్ట్రేలియాలో వున్న అన్ని రకాలా, ప్రాంతాల ప్రజలకు … వైద్యో నారాయణో హరిఃని చదవడం కొనసాగించండి

విశ్వ సంగీతం

అడిలైడ్ నగరం మార్చిలో మహా హడావిడిగా వుంటుంది. "ఫ్రింజ్ ఫెస్టివల్" పిచ్చి ఒకవైపు, "క్లిప్సల్" కార్ రేసులు ఒకవైపూ, అడిలైడ్ కప్పు (గుర్రప్పందాలు) ఒకవైపూ అయితే వీటన్నిటినీ తలదన్నేది "WOMADelaide" సందడి. World Music and Dance in Adelaide అన్నమాట వోమాడిలైడ్ అంటే. మార్చిలో నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో దేశ దేశాలనించి సంగీతమూ, నాట్యమూ చూడొచ్చు. టిక్కెట్టు ధర మనిషికి నూటా ఇరవైడాలర్లున్నా, పొద్దున్న వెళ్ళామంటే రాత్రి పన్నెండింటివరకూ అడిలైడ్ బొటానిక్ … విశ్వ సంగీతంని చదవడం కొనసాగించండి

జో జీతా వోహీ సికందర్

టెన్నిస్ చరిత్రలోనే అతి గొప్ప పోరాటం- అయిదు గంటల, యాభై అయిదు నిముషాలు అభిమానులని వెర్రెత్తించిన ఫైనల్- సెర్బియాకి చెందిన నోవాక్ జోకోవిచ్ కీ స్పెయిన్ కిన్ చెందిన రాఫెల్ నడాల్ కీ మధ్యన ఆదివారం రాత్రి మెల్బోర్న్లో రాడ్-లేవర్ ఎరీనా లో జరిగింది. ======================================================================= సాధారణంగా జనవరి నెలలో ఆస్ట్రేలియాలో ఎండా వేడీ భరించలేనంతగా వుంటాయి. ఉదయం ఆరు గంటలకే ముప్ఫయి అయిదు డిగ్రీల సెల్సియస్ చేరుకునే ఉష్ణోగ్రత దాదాపు రాత్రి పదింటి వరకూ అక్కడే … జో జీతా వోహీ సికందర్ని చదవడం కొనసాగించండి