మోహినీఆట్టం

వివిధ రకాల భారతీయ శాస్త్రీయ సంగీత రీతులని వినటం, శాస్త్రీయ నాట్యాలని చూడటం చాలా బాగుంటుంది. కిందటి శనివారం మా అడిలైడ్ నగరంలో శ్రీమతి గోపికా వర్మ గారి మోహినీ ఆట్టంకార్యక్రమం జరిగింది. నేనింతవరకూ మోహినీఆట్టం చూసిన అనుభవం లేదు కాబట్టి, పిల్లలని తీసుకుని ఉత్సాహంగా వెళ్ళాను. ఆ సాయంత్రం చాలా గొప్ప అనుభూతినిచ్చింది. ముందస్తుగా వేదిక మీద ఆవిడ అందం ఏదో దేవకన్య దిగొచ్చినట్టుగా అనిపించింది, అతిశయోక్తి కాదు. తరువాత ఆమె మైకు అందుకుని మాట్లాడినప్పుడు … మోహినీఆట్టంని చదవడం కొనసాగించండి

అడిలైడ్ లో కృష్ణాష్టమి

మురళీకి ఎప్పణ్ణించో మంచి సంగీతాన్నీ, గుండెలోతుల్లోంచి భక్తినీ రంగరించి ఒక కచేరీ ఇవాలని ఆశ. అది నిన్న కృష్ణాష్టమి రోజు తీరింది. నిన్న రాత్రి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఒక కచేరీ చేయమని మమ్మల్ని అడిగారు. అయితే మధుకి పరీక్షలు దగ్గరకొస్తున్నాయని నన్నూ మధూని వదిలేసి మురళీ అనన్యా రాత్రి పదింటినించి పదకొండింటి వరకూ కచేరీ చేసారు. మురళీ ముందుగా "అహిర్ భైరవ్" (చక్రవాకం) లో పండిత్ జస్రాజ్ పాడిన "ఆజ్ తో ఆనంద్" పాట వాయించారు. … అడిలైడ్ లో కృష్ణాష్టమిని చదవడం కొనసాగించండి

జెంజు అనబడు చెంగిజ్ ఖాన్ కథ

మా పిల్లలిద్దరికీ కొన్నేళ్ళుగా పెంపుడు జంతువులమీద ఆశ. ఎన్నో తర్జన భర్జనలూ, వాద ప్రతివాదాలూ ఇంట్లో. వారి తండ్రిది పిల్లలేదడిగినా కాదనలేని పితృ హృదయం.! కుక్కనో పిల్లినో పెంచుకుందామంటే మాంసాహారపు బాధ. వాటిని శాకాహారులుగా మారుద్దామంటే వాటి స్వజాతి లక్షణాల మీద మన పెత్తనం ఏమిటి అన్న మీమాంస! చివరాఖరికి ఒక కుందేలు పిల్లని పెంచుకుందామని నిర్ణయించుకున్నారు. ఒక రోజు నేను ఆఫీసుకెళ్ళిన సమయంలో  (అమ్మ లేదు, దిసీజె గుడ్ టైం!) బజారెళ్ళి కావల్సిన సరంజామా అంతా … జెంజు అనబడు చెంగిజ్ ఖాన్ కథని చదవడం కొనసాగించండి

వయొలీన్ చక్రవర్తి – జోగ్ రాగమూ

నిన్న రాత్రి మా వూళ్ళో వయొలీన్ చక్రవర్తి శ్రీ ఎల్.సుబ్రహ్మణ్యం గారి కచేరీ జరిగింది. ఆయనతో పాటు ఆయన సుపుత్రుడు అంబి సుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నారు. శ్రీ తిరుచూర్ మోహన్ మృదంగం పైనా, శ్రీ సత్య సాయి మోర్ సింగ్ పైనా సహకారాన్నందించారు.   కచేరీ రెండు గంటల పాటు సాగింది. టికెట్టు ధరని దృష్టిలో పెట్టుకుని కొందరు ఆయన ఇంకొంచెం ఎక్కువసేపు వాయించి వుండాల్సింది అని గునిసారు. ఆయన రెండే పాటలు, ఎక్కువగా మనోధర్మ సంగీతం … వయొలీన్ చక్రవర్తి – జోగ్ రాగమూని చదవడం కొనసాగించండి

మధువంతి

మధువంతి- ధర్మవతి రాగంలోంచి పుట్టిన అందమైన రాగం. చాలా వరకు హిందుస్తానీ సంగీతంలో ఉపయోగించినా, కొన్ని కర్ణాటక సంగీతంలో పాటలు కూడా వున్నాయి. రాగానికి అందం చాలావరకు ప్రతి మధ్యమం లో, కాకలి నిషాదం లో వుంటుంది. "కండనాల్ ముదలాయ్ కాదల్ పెరుగుదడీ" అనే పాటా, "రస్మ్-ఎ-ఉల్ఫత్" అనే హిందీ సినిమాలో పాటా వింటే చాలా వరకు మధువంతి అర్ధమౌతుంది.   మధువంతి- మా పదిహేడేళ్ళ అమ్మాయి! మేమిద్దరం ఎంతో ఇష్టపడ్డ రాగం పేరు పెట్టుకున్నాం. (అసలు … మధువంతిని చదవడం కొనసాగించండి

టీ. యెం. కృష్ణ – తంబూరా సహకారం

అనుకున్నట్టే జూన్ ఇరవయ్యో తేదీన టీ.యెం.కృష్ణ కచేరీ చాలా గొప్పగా జరిగింది. ఆయనకు వయొలీన్ సహకారాన్ని శ్రీ శ్రీరాం, మృదంగ సహకారాన్ని శ్రీ తంజావూర్ మురుగ భూపతి గారూ ఇచ్చారు. కచేరీకీ మా అమ్మాయి మధువంతి తంబురా సహకారాన్నందించింది. అది మాకొక మంచి అనుభూతి, తనకొక మంచి అనుభవం. ఔత్సాహిక కళాకారులకు పెద్ద కళాకారులతో వేదిక మిద కూర్చుని తంబూరానో లేక మరేదైనా సహకారాన్నో అందించటం ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సిక్కిల్ సోదరీమణులతో వేదిక మిద కుర్చుని తంబూరా … టీ. యెం. కృష్ణ – తంబూరా సహకారంని చదవడం కొనసాగించండి

వినదగు నెవ్వరు చెప్పిన

వినదగు నెవ్వరు చెప్పిన శారద   రోజువారీ జీవితంలో మనం ఎంతో మందిని కలుస్తుంటాం. ప్రతీ వ్యక్తి తనదంటూ ఒక ముద్ర వేసి కానీ వదలరు. ఒకరినించి ఎలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో నేర్చుకుంటే,   ఇంకొకరినించి ఎలా ప్రవర్తించకూడదో, ఆలోచించ కూడదో నేర్చుకుంటాం.   ఈ సంవత్సరం మార్చి నెల ఆరో తారీఖున మా వూళ్ళో త్యాగరాజ ఆరాధన జరిగింది. సాధారణంగా ఈ కార్యక్రమంలో రెండు భాగాలుంటాయి. మొదటి భాగంలో అడిలైడ్ కళాకారులందరూ కలిసి పంచ రత్న … వినదగు నెవ్వరు చెప్పినని చదవడం కొనసాగించండి

అడిలైడ్ లో భూకంపం

మెల్బోర్న్, సిడ్నీలలో జీవితం తో పోలిస్తే  అడిలైడ్ లో జీవితం పల్లెటూళ్లలో ఉన్నట్టు ప్రశాంతంగా, ఏ కుదుపులూ లేకుండా వుంటాయి. అసలు ఇలాటి పేరుతో ఒక నగరం వుందన్న విషయమే చాలా మందికి తెలియదని మా అడిలైడ్ జనాలు కృంగి పోతూ వుంటారు. అలాటి మేమూ వార్తల్లోకెక్కాము. మొన్నటి శుక్రవారం (16 ఎప్రిల్ 2010) రాత్రి సంభవించిన భూకంపం తో. శుక్రవారం రాత్రి పదకొండున్నరకి మంచి నిద్రలో వున్నాను. ఉన్నట్టుండి పెద్ద చప్పుడు, ఇల్లంతా కదిలిన భావనతో … అడిలైడ్ లో భూకంపంని చదవడం కొనసాగించండి

నాలుగో శుక్రవారం సంగీతం – రెండు త్యాగరాజ కీర్తనలు

మా వూళ్ళో ప్రతీ నెలా (ఫిబ్రవరి నించి నవంబరు వరకూ) నాలుగో  శుక్రవారం సంగీతం కచేరీలు జరుగ్తాయి. వీటిని 4FM (4th Friday Music) అని పిలుస్తాము.మా వూళ్ళో ప్రతీ నెలా (ఫిబ్రవరి నించి నవంబరు వరకూ) నాలుగో  శుక్రవారం సంగీతం కచేరీలు జరుగ్తాయి. వీటిని 4FM (4th Friday Music) అని పిలుస్తాము. వీటిని organize చేసేది నేనూ, మా వారు మురళీ కావటం వల్ల ఇవి మా ఇంట్లోనే జరుగుతాయి. వీటి కొరకు మా … నాలుగో శుక్రవారం సంగీతం – రెండు త్యాగరాజ కీర్తనలుని చదవడం కొనసాగించండి

సారమైన మాటలెంతొ….

కొన్ని నెలల క్రితం నేను "మార్గళి రాగం" అనే తమిళ సినిమా చూసాను.కొన్ని నెలల క్రితం నేను "మార్గళి రాగం" అనే తమిళ సినిమా చూసాను. సినిమా అంటే మామూలు సినిమా కాదు. శ్రీమతి బోంబే జయశ్రీ, శ్రీ టి.యం.కృష్ణ గారు కలిసి చేసిన రెండు గంటల కచేరీ ని అద్భుతంగా ఫిల్ము చేసారు. సాధారణంగా కచేరీల్లో గాయకుడు/గాయని ఎంత బాగా పాడినా, గొప్ప సౌండ్ సిస్టం వుంటే కానీ దాన్లోని అందం అంతగా బయటికి రాదు. … సారమైన మాటలెంతొ….ని చదవడం కొనసాగించండి