వార్తలకెక్కని మనుషులు

                                                          2017 డిసెంబరు మొదటి వారం హైదరాబాదులో బంధువుల ఇంట్లో పెళ్ళికని కుటుంబమంతా ఇండియా వొచ్చాము. పెళ్ళి తరవాత పిల్లలిద్దరూ ఉత్తర భారతదేశ యాత్ర చేయాలని సరదా పడితే, రాజస్థాన్ అంతా తిరిగి చూసాము. జైపూర్, జైసల్మేర్, ఉదయ్ పూర్ నగరాలు చూసి చాలా సరదాగా గడిపాము ఆ సెలవులు రాజస్థాన్ కొంచెం వెనకబడిన ప్రాంతంగా, స్త్రీల పట్ల నేరాలలో మొదటి స్థానాలలో వున్న రాష్ట్రంగానే తెలుసు. నిజానికి ఉత్తర భారతం అంతా నేర మయమేనని మనకి … వార్తలకెక్కని మనుషులుని చదవడం కొనసాగించండి

నర జాతి చరిత్ర సమస్తం…..

వ్యక్తులుగా, కుటుంబాలుగా,సమూహాలుగా, పరిణితి చెందిన సమాజాలుగా, దేశాలుగా ఎదుగుతున్నామని అనుకుంటున్న మనం, మన తోటి మనుషులతో వ్యవహరిస్తున్న తీరు కొంచెం తరచి చూసుకుంటే సిగ్గు కలగక మానదు. ప్రపంచానికే స్వయం ప్రకటిత పెద్దన్న అమెరికాలో ఈ సంవత్సరం మేలో జాత్యహంకార హత్య జరిగింది. దాని ప్రభావమూ, "BLM" ప్రదర్శనలూ అందరూ ఎరిగినవే. దరిమిలా అన్ని దేశాలూ, సంఘాలూ, సమాజాలూ తమ తమ చరిత్రలనీ, ప్రవృత్తులనీ సమీక్షించుకోవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని … నర జాతి చరిత్ర సమస్తం…..ని చదవడం కొనసాగించండి

నాలో ఇంకొకరు

నాకు చిన్నప్పుడు సినిమాల్లో హీరో లేదా హీరోయిను మానసిక సంఘర్షణ అద్దంలో చూపించే సీన్లు భలే నచ్చేవి. జమున ఒక చిన్న గుడ్డల మూటతో ఇల్లు దాటి వెళ్ళబోతుంటే , అద్దంలో ఒక జమున వొచ్చి, పెద్ద స్పీచీ ఇచ్చి, "ఆగు వెళ్ళకు," అని సలహా ఇస్తుంది. సరే అని, జమున ఏదో ఆలోచించుకునేలోపే ఇంకొక జమున ప్రత్యక్షమై "నీకేమైనా పిచ్చా? దాని మాటలు వింటావే? బానే వుంది, నడు నడు," అని మళ్ళీ బయల్దేరదీస్తుంది. నిజం … నాలో ఇంకొకరుని చదవడం కొనసాగించండి

చదివించిరి నను గురువులు

నెగెటివ్ గురువులు    జీవితం కంటే పెద్ద గురువింకెవరు వున్నారు? చావగొట్టి చెవులు మూసైనా సరే మనకి కావల్సిన పాఠాలని నేర్పించే గురువే జీవితం. అయితే క్లాసులో తెలివైన విద్యార్థులు ఇతరుల అనుభవాలనించి నేర్చుకున్నట్టు జివితంలో కూడా చాలా విలువైన పాఠాలని ఇతర్ల అనుభవాలనీ, జివితాలనీ చూసి నేర్చుకుంటాం. చాలా మంది వారి ప్రవర్తనతో, ఆలోచనలతో, మాటలతో మనని ఎంతగానో ప్రభావితం చేస్తారు. ఇన్స్పైర్ చేస్తారు. వీళ్ళంతా కూడా మనకి గురువులే. చాలా సార్లు వీరిని మనం … చదివించిరి నను గురువులుని చదవడం కొనసాగించండి

మా ఇంట్లో మర్డర్లు

ఎవరూ నమ్మని నిజమేంటంటే మా యింట్లోనూ వయలెన్సుంది! నోట్లో వేలు పెడితే కొరకలేనట్టుండి కళ్ళద్దాల్లోంచి పెద్ద పెద్ద కళ్ళతో ఏమీ తెలియనట్టు చూస్తుండే మా ఆయన- రోజుకి సగటున రెండు హత్యలు చేస్తారు. నిజ్జంగా నిజం! ఎవరినంటారా? పాటలని! కనీసం రోజుకి రెండు మూడు పాటలని భాషా భేదం లేకుండా నిర్దాక్షిణ్యంగా హత మార్చనిదే వారికి సాంబారన్నం గొంతు దిగదు. ఎలాగంటారా? అక్కడికే వస్తున్నా- అసలు పాటంటే ఏమిటి, ఎందుకు అన్న విషయంలోనే మా ఇద్దరికీ అభిప్రాయభేదాలున్నాయని … మా ఇంట్లో మర్డర్లుని చదవడం కొనసాగించండి

అమెరికా అందాలు-2

లాస్ ఎంజెలెస్   అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో  మూడు మిలియన్ల పైగా జనాభా తో న్యూ యార్క్ తరవాత జనాభా దృష్ట్యా రెండో పెద్ద నగరం, లాస్ ఎంజెలెస్ .  ఒకప్పుడు ఈ నగరం మెక్సికోకి చెందిందై ఉండేదట. పంతొమ్మిదో శతాబ్దంలో మెక్సికో తో యుధ్ధం ముగిసిన తరువాత అమెరికా భూభాగంలో కలిసిపోయింది. హాలీవుడ్ సినిమా నటులూ, వారిని గారాబం చేయటానికి డాక్టర్లూ, వాళ్ళ ఆస్తి వ్యవహారాలు చక్కబెట్టటానికి వుండే లాయర్లతో వుండే బెవర్లీ హిల్స్ ఒక వంకా, … అమెరికా అందాలు-2ని చదవడం కొనసాగించండి

అమెరికా అందాలు – I

డిసెంబరు నెలలో మొదలు పెట్టి దాదాపు నాలుగు వారాలు అమెరికా అంతా చుట్టి రెండు వారాల క్రితం అడిలైడ్ తిరిగొచ్చాము. ఇటు చివర స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయం నించి మొదలు పెట్టి అటు చివర హెన్రీ ఫోర్డ్ మ్యూజియం వరకూ ఎన్నెన్నో వింతలూ విశేషాలూ చూసాము! అన్నిటినీ మించి అద్బుతంగా మంచు కురుస్తుంటే ఇంట్లో వెచ్చగా కూర్చుని చూస్తూ "అబ్బ, ఎంత బాగుంది" అనుకున్నాము. తల్లి తండ్రులనీ, తోబుట్టువలనీ బంధువులనీ పలకరించి చెమర్చిన కళ్ళతో తిరిగొచ్చాము. … అమెరికా అందాలు – Iని చదవడం కొనసాగించండి

భూమి గుండ్రంగా వుంది

నేను అప్పుడప్పుడూ కథలు తెలుగు లోంచి ఇంగ్లీషులోకి అనువదిస్తూ వుంటాను. అయితే ఆ కథకులు లబ్ద ప్రతిష్టులూ పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళూ. ఈ సారి నేనొక చిన్నారి రచయిత్రి కథని ఇంగ్లీషు లోంచి తెలుగులోకి అనువదిస్తున్నాను. కథ గురించి- మొన్న మా చిన్నది అనన్య తలెత్తకుండా కంప్యూటర్ మీద కీ-బోర్డు టక టక లాడిస్తుంది. "ఏం చేస్తున్నావే" అని అడిగితే, "అయాం రైటింగ్ ఎ స్టోరీ" అంది. అది ఎప్పుడూ వుండేదే కాబట్టి పెద్ద పటించుకోలేదు. తర్వాత … భూమి గుండ్రంగా వుందిని చదవడం కొనసాగించండి

గాజు బొమ్మలు

నేను ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు అన్నిటికంటే తేలికైన సబ్జెక్టు ఇంగ్లీషు అనుకునేవాళ్ళం. పరీక్షకి నెల రోజుల ముందు కొంచెం కష్టపడి చదివితే బానే మార్కులొచ్చేవి. ఒక టెక్స్టు బుక్కూ, ఒక నాన్-డిటెయిల్డ్ పుస్తకమూ, ఇంతే! అయితే పదో తరగతి టెక్స్టు బుక్కు మాత్రం చాలా మంచి సాహిత్యంతో పరిచయం చేసిందనుకోండి! అది వేరే సంగతి. ఇక్కడ ఆస్ట్రేలియాలో మాత్రం ఇంగ్లీష్ స్టడీస్ లెక్కలూ ఫిజిక్స్ కన్నా గొట్టైన సబ్జెక్టు. మా మధుకప్పుడే ఆ సబ్జెక్టు తలచుకుంటేనే తెల్ల వార్లూ … గాజు బొమ్మలుని చదవడం కొనసాగించండి

ఎల్లలు లేని ప్రపంచం

మొన్న శనివారం. పొద్దున్నే మా మావగారు,"శారదా! ఇవాళ గోంగూర పచ్చడి చేస్తానన్నావు! తోటలో నించి కోసి తెస్తా కొంచెం ఎండెక్కగానే," అన్నారు.  (ప్రస్తుతం మా అత్త మామలు మాతోనే వుంటున్నారు.) మళ్ళీ, "అలాగే ఆకుకూర వేసి పప్పు చేస్తావు చూడు, అది కూడాబాగుంటుంది.! ఇవాళ చేయి!"  "అలాగేనండి!"-నేను.  "నేను స్నానం చేసి వరకు కూరలు కోయకు! నేనొచ్చి కోసి పెడతాను!"  "అలాగేనండి! తొందరేం లేదు. మెల్లిగా షేవింగూ స్నానమూ చేసి రండి!"- నేను. మా పూర్వీకులది తెలంగాణా! నేను … ఎల్లలు లేని ప్రపంచంని చదవడం కొనసాగించండి