సంఘంలో నీతికీ స్త్రీవాదానికీ, స్త్రీల ఆర్ధిక స్వాతంత్ర్యానికీ సంబంధం వుందా? అసలు స్త్రీలకి ఆర్ధిక స్వాతంత్ర్యం వుండాలా? వొద్దా? దాదాపు ఇరవై యేళ్ళ కింద మా పెళ్ళైన కొత్తలో అప్పుడప్పుడూ సేలం దగ్గర మా అత్తగారింట్లో సెలవులు గడిపే దాన్ని. మా అత్తగారింట్లో అప్పట్లో "విమెన్స్ ఎరా" అనే పత్రిక వచ్చేది. నేను దాన్లో కథలు చదివేదాన్ని. వాటిని "heart warming stories" అని పిలిచే వాళ్ళు. అన్ని కథల్లో దాదాపు ఒకటే వస్తువు ఉండేది. (ఇప్పుడూ … నీతి-స్త్రీవాదం-ఆర్ధిక స్వాతంత్ర్యం- IIని చదవడం కొనసాగించండి
అవీ-ఇవీ
నీతి – స్త్రీ వాదం-ఆర్ధిక స్వాతంత్ర్యం
ఈ పై మూడు పదాలూ ఒకదానికొకటి సంబంధం లేనివని నా అభిప్రాయం. కానీ చాలా చోట్ల వాటి మధ్య లేని సంబంధం వున్నట్టూ,ఒకదానికొకటి కారణాలన్నట్టూ చూసి నాకేదో అర్ధం కాలేదనుకుంటున్నాను. "స్త్రీవాదాన్ని నమ్మిన వాళ్ళూ, ఆర్ధిక స్వాతంత్ర్యం వున్నవాళ్ళూ తేలిగ్గా నీతి తప్పుతారు." ఇలాటి బ్లాంకెట్ వ్యాఖ్యానం తప్పుడు వ్యాఖ్యానం అన్న మాట ఎంత నిజమో, దీనితో ఏకీభవించేవారు బహు కొద్దిమంది అనే మాటా అంతే నిజం. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే- కొన్నేళ్ళ క్రితం నేను వీరేంద్రనాథ్ … నీతి – స్త్రీ వాదం-ఆర్ధిక స్వాతంత్ర్యంని చదవడం కొనసాగించండి
కాల ప్రవాహం
2003 జనవరి ఇరవై "అమ్మా! ఏం చేస్తున్నావ్?" నాలుగన్నరేళ్ళ అను అడిగింది. "వచ్చే వారం స్కూలు తెరుస్తున్నారు కదా? అక్క యూనిఫాం, స్కూల్ బాగూ అన్ని రెడీ చేస్తున్నాను." "నా ముయిఫాం ఏది మరీ? నేను కూడా చైల్డ్ కేర్ వదిలేసి స్కూల్ కెళతా!" "ముయిఫాం కాదమ్మా! యూనిఫాం. నువ్వు స్కూలు కెళ్ళాలంటే ఇంకా ఆరు నెలలాగాలి. జూన్ లో నీ పుట్టినరోజు అవుతుంది కదా? అప్పుడు నువ్వు కూడా స్కూల్ కెళ్ళొచ్చు." (ఇక్కడ అకడెమిక్ సంవత్సరం … కాల ప్రవాహంని చదవడం కొనసాగించండి
స్కార్లెట్-ఓ-హారా
"గుట్టల కొద్దీ పుస్తకాలు చదువుతావు కదా? ఇన్ని పుస్తకాల్లో నీకు చాలా నచ్చిన పాత్ర ఏది?" అని చాలా యేళ్ళ క్రితం ఒక కజిన్ నన్ను అడిగాడు.తడుముకోకుండా "స్కార్లెట్!" అని చెప్పాను. "స్కార్లెట్టా"? నమ్మలేనట్టడిగాడు తను. మొన్నా మధ్య ఇదే ప్రశ్న మా పిల్లలిద్దరూ అడిగారు. మళ్ళీ అదే జవాబు చెప్పాను. వాళ్ళిద్దరూ మార్గరెట్ మిచెల్ రాసిన "గాన్ విత్ ద విండ్" పుస్తకం చదవలేదు కానీ, సినిమా చూసారు. నా జవాబు విని కెవ్వుమన్నారు. "ఛీ!ఛీ!నాట్ … స్కార్లెట్-ఓ-హారాని చదవడం కొనసాగించండి
మానవ సేవే మాధవ సేవ
జూన్ 2010 నాటికి మా అత్త మామలకు పెళ్ళయి సరిగ్గా యాభై సంవత్సరాలు. ఆ శుభ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికే జులై లో ఇక్కణ్ణించి మేమూ, ఇంగ్లండు నించి మా ఆడపడుచూ మద్రాసు చేరుకున్నాము. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మేమొక చిన్న డిన్నర్ పార్టీ కూడా ఏర్పాటు చేసాము. ఆ పార్టీకి దగ్గరి కుటుంబ సభ్యులూ, స్నేహితులూ హాజరైనారు. చాలా సంతోషంగా గడిచిపోయింది ఆ సాయంత్రం. ఇలాటి సందర్భాల్లో మన వాళ్ళు తప్పకుండా బహుమతులు తెస్తారు. అందుకే మేము … మానవ సేవే మాధవ సేవని చదవడం కొనసాగించండి
గురు సాక్షాత్ పరబ్రహ్మాః
మా వారు, మురళీధరన్ గారు సిక్కిల్ సిస్టర్స్ గా ప్రఖ్యాతి పొందిన సిక్కిల్ కుంజుమణి,నీలా గార్ల ప్రియ శిష్యులు. మద్రాసు వెళ్ళిన ప్రతీసారీ వారి ఇంటికి వెళ్ళి పలకరించి వస్తారు మురళి. వీలైతే ఒక్కటైనా కీర్తన కూడా నేర్చుకుంటారు. 1992 లో మా పెళ్ళి జరిగిన రోజు కూడా సాయంత్రం ఇద్దరం కలిసి ముందుగా వారింటికే వెళ్ళాము. నన్ను ఆ రోజు పరిచయం చేయగానే వాళ్ళడిగిన ప్రశ్న, "పాడువాళా?" అని. (పాడుతుందా?) "ఏదో, కొంచెం" అని నసుగుతూ … గురు సాక్షాత్ పరబ్రహ్మాఃని చదవడం కొనసాగించండి
కలకంఠి
చదువుకున్నా, చదువుకోకపోయినా, జీవితమూ సమస్యలూ, చుట్టూ వుండే మనుషుల పట్ల వాళ్ళకుండే అవగాహనా, ధైర్యమూ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తాయి. ఒక రెండేళ్ళ క్రితం లైబ్రరీలో టాగూరు కథల పుస్తకం చదివాను. నాకాయన కథల్లోని స్త్రీ పాత్రలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. చదువుకున్నా, చదువుకోకపోయినా, జీవితమూ సమస్యలూ, చుట్టూ వుండే మనుషుల పట్ల వాళ్ళకుండే అవగాహనా, ధైర్యమూ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తాయి. నిజ జీవితంలో అలాటి ఆడవాళ్ళని కలిస్తే బాగుండుననీ అనిపిస్తుంది. ఆ మధ్య మా … కలకంఠిని చదవడం కొనసాగించండి
పుష్పగుఛ్ఛం
నాలుగు వారాలు హైదరాబాదు, మద్రాసు, కేరళ చుట్టి వచ్చాను. బంధువులనీ, స్నేహితులనీ, బంధు హితులనీ కలుసుకున్నాను. అత్త మామల్నీ, అమ్మా నాన్నల్నీ చూసాను, వారితో సమయం గడిపాను. నాలుగు వారాల్లో ఎన్ని అనుభవాలో పేర్చుకున్నాను, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, కొంత మంది ఆసక్తి కరమైన వాళ్ళనీ కలుసుకున్నాను. ఆ అనుభూతులూ, అనుభవాలూ, ఆలోచనలూ కలిపి కూర్చిన పుష్ప గుఛ్ఛం.... త్వరలోనే....
మానవత్వపు పరిమళం
మానవత్వపు పరిమళంమనం కొంతమందిని చూసింది చాలా కొద్ది కాలమైనా, వాళ్ళల్లో వున్న ఏదో ఒక అనిర్వచనీయమైన మంచితనం వల్ల వాళ్ళని మరిచిపోలేం! మనల్ని అన్ని రకాలుగా ప్రభావితం చేసి,మన బ్రతుకులో పెద్ద ప్రాముఖ్యత వున్న వాళ్ళ పక్కనే ఇలాంటి వాళ్ళకి కూడా చోటుంటుంది. అలాటి కొంత మంది మనుషుల గురించి...... 1993 లో మద్రాసు దగ్గర సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగం చేస్తూ వున్నాను. సాయంత్రం ఇంటికొచ్చేసరికి మల్లెపూల దండతో ఇంటికొచ్చేవాడు తాత. బక్కగా, మొహంలో అలసటతో, సీరియస్ … మానవత్వపు పరిమళంని చదవడం కొనసాగించండి
చిన్నారి రిక్వెస్టు
మా చిన్నమ్మాయి పన్నెండేళ్ళ అనన్య అప్పుడప్పుడూ కథలూ కవితలూ (ఇంగ్లీషులో) రాస్తుంది. అడిలైడ్ అడ్వర్టైజర్ వారి యంగ్ రైటర్స్ అవార్డు కూడా రెండు సార్లు గెలుచుకుంది. తన కథలూ కవితలూ ఈ కింది బ్లాగ్ సైట్లో పెడుతూ వుంటుంది (తనకి బుధ్ధి పుట్టినప్పుడు). http://www.anu-mystories.blogspot.com అయితే బ్లాగ్ స్పాట్ లో "కేటగరీలు" ఎలా తయారు చేయాలో దానికి అర్ధం కావటం లేదు. బ్లాగ్ స్పాట్ హెల్ప్ వెతికితే చాలా తిరకాసు వ్యవహారంగా అనిపించింది. ఎవరైనా సలహా ఇవ్వ … చిన్నారి రిక్వెస్టుని చదవడం కొనసాగించండి