పులి కడుపున పులే పుడుతుందా?

పులి కడుపున పులే పుడుతుందా? (Like Mother Like Daughter – Elle Croft - ఒక సమీక్ష) క్రితం సంవత్సరం ఒక సినిమా చూసాము. "గొప్పవాడి కడుఫున గొప్పవాడే పుడతాడు, తక్కువ వాడి కడుపున తక్కువ వాడే పుడతాడు," అనే ముతక సందేశాన్ని చిత్ర విచిత్రమైన కథతో చెప్పిన ఆ సినిమా చూసి, వార్నీ, అనుకున్నాను. ఒక మనిషి వ్యక్తిత్వం రూపు దిద్దుకోవడంలో జెనెటిక్ కోడింగ్ దే ముఖ్య పాత్ర అని చాలామంది నమ్ముతారు కూడా. … పులి కడుపున పులే పుడుతుందా?ని చదవడం కొనసాగించండి

నీలాంబరి-సమీక్ష

      నీలాంబరి కథల పుస్తకంపై జులై నెల రచనలో వచ్చిన సమీక్ష. నా పట్ల ఆదరాభిమానాలూ, నా కథా రచన పట్ల నమ్మకమూ కలబోసి ఇంత లోతైన విశ్లేషణ రాసిన వసుంధర దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు. నీలాంబరి సమీక్ష

చేజారిన స్వర్గం

కొన్నిపుస్తకాలు మొదటిసారి చదివినప్పుడు మనకేమాత్రం నచ్చవు. ఏమిటీ చెత్తా అనిపిస్తుంది కూడా. కానీ అదే పుస్తకాన్ని కొన్నేళ్ళ తరవాత చదివితే కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. అప్పుడు, "ఈ పుస్తకం నేననుకున్నంత చెత్తగా లేదేమో" అనిపిస్తుంది. ఇంకా కొన్నేళ్ళు పోయాక చదివితే, "ఇంత మంచి పుస్తకం నాకెందుకు నచ్చలేదబ్బా!" అని కూడా అనిపిస్తుంది. పెరుగుతున్న వయసుతో పాటు మన ఆలోచనల్లో వస్తున్న మార్పులకీ, మనం ఇతర్ల ఆలోచనలూ అభిప్రాయాలూ గుర్తించి గౌరవించడం నేర్చుకుంటున్నామన్న విషయానికీ ఇంతకంటే పెద్ద ఋజువేమీ … చేజారిన స్వర్గంని చదవడం కొనసాగించండి

నీలాంబరి- కథల పుస్తకం

దాదాపు రెండేళ్ళ క్రితం, అంటే డిసంబరు 2011 ప్రాంతంలో నేనింతవరకూ రాసినవీ, అక్కడక్కడా పత్రికల్లో వచ్చినవీ కొన్ని కథలతో ఒక సంకలనం వేయిస్తే మంచిదేమో అన్న ఆలోచన వచ్చింది. మా కుటుంబ సభ్యులూ, శ్రేయోభిలాషి శ్రీ సురేశ్ కొలిచాల గారి ప్రోత్సాహంతో కథల ఎడిటింగ్ మొదలు పెట్టాను. ఆ పనిలో తల మునకలుగా వుండగానే హైదరాబాదులో మా అమ్మగారు అస్వస్థులవడం జరిగింది. ఆ తర్వాత ఒక ఏడెనిమిది నెలలు ఇంకే విషయం గురించీ ఆలోచించలేని ఒకలాటి మానసిక … నీలాంబరి- కథల పుస్తకంని చదవడం కొనసాగించండి

అమెరికన్ బుడుగు

అంతర్లీనంగా మనందరిలోనూ ఒక అల్లరి పిల్లవాడు లేదా పిల్లది వుంటాడు/వుంటుంది. పెద్దయిపోవాలన్న తొందర్లో వాళ్ళని మనసులోంచి గెంటేస్తాం. నేను అప్పుడప్పుడూ చదివే ఇంగ్లీషు/తెలుగు నవలలు చూసి మురళీ "ఒక్కటన్నా బొమ్మలేని ఆ పుస్తకాలు ఎలా చదువుతారబ్బా," అని ఆశ్చర్యపోతూ వుంటారు. తనకి పుస్తకంలో కథతోపాటు బాగా బొమ్మలు వుండాలి.   అందుకే మా ఇంట్లో నేను పుస్తకాలు కొన్నప్పుడల్లా తనూ పోటీ పడి "ఎస్ట్రిక్స్", "టిన్-టిన్" లాటి కామిక్కులు బాగా కొంటూ వుంటారు. వాటి తర్వాత అంతే … అమెరికన్ బుడుగుని చదవడం కొనసాగించండి

థేమ్స్ లో పడవ ప్రయాణం

"గమ్యం" సినిమాలో ఒక చోట హీరోయిను హీరో తో, "నువ్వు చూసింది ప్రపంచం కాదు, ప్రదేశాలు." అంటుంది. "కారులో కూర్చుని అద్దాలు బిగించుకుని కూర్చుంటే కనిపించేది...." అని ఇంకేదో అంటుంది కూడా (నాకంతగా గుర్తు లేదు). అయితే ఈ డైలాగు వినగానే నాకు రెండు పుస్తకాలు గుర్తొచ్చాయి. Robert Prisig రాసిన "Zen and the art of motorcycle maintenance" ఒకటైతే, Jerome K. Jerome రాసిన "Three men in a boat" రెండోది. అన్నట్టు గమ్యం సినిమాకి … థేమ్స్ లో పడవ ప్రయాణంని చదవడం కొనసాగించండి