పులి కడుపున పులే పుడుతుందా?

పులి కడుపున పులే పుడుతుందా? (Like Mother Like Daughter – Elle Croft - ఒక సమీక్ష) క్రితం సంవత్సరం ఒక సినిమా చూసాము. "గొప్పవాడి కడుఫున గొప్పవాడే పుడతాడు, తక్కువ వాడి కడుపున తక్కువ వాడే పుడతాడు," అనే ముతక సందేశాన్ని చిత్ర విచిత్రమైన కథతో చెప్పిన ఆ సినిమా చూసి, వార్నీ, అనుకున్నాను. ఒక మనిషి వ్యక్తిత్వం రూపు దిద్దుకోవడంలో జెనెటిక్ కోడింగ్ దే ముఖ్య పాత్ర అని చాలామంది నమ్ముతారు కూడా. … పులి కడుపున పులే పుడుతుందా?ని చదవడం కొనసాగించండి

నర జాతి చరిత్ర సమస్తం…..

వ్యక్తులుగా, కుటుంబాలుగా,సమూహాలుగా, పరిణితి చెందిన సమాజాలుగా, దేశాలుగా ఎదుగుతున్నామని అనుకుంటున్న మనం, మన తోటి మనుషులతో వ్యవహరిస్తున్న తీరు కొంచెం తరచి చూసుకుంటే సిగ్గు కలగక మానదు. ప్రపంచానికే స్వయం ప్రకటిత పెద్దన్న అమెరికాలో ఈ సంవత్సరం మేలో జాత్యహంకార హత్య జరిగింది. దాని ప్రభావమూ, "BLM" ప్రదర్శనలూ అందరూ ఎరిగినవే. దరిమిలా అన్ని దేశాలూ, సంఘాలూ, సమాజాలూ తమ తమ చరిత్రలనీ, ప్రవృత్తులనీ సమీక్షించుకోవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని … నర జాతి చరిత్ర సమస్తం…..ని చదవడం కొనసాగించండి

దూర దూరంగా ఆస్ట్రేలియాలో

అసలు ఈ సంవత్సరం మొదలవడమే మహా అధ్వాన్నంగా మొదలైంది కొరొనా వైరస్ వల్ల. ఎటువంటి ఉష్ట్రపక్షినైనా వదలకుండా మెడలు విరిచి అందరి దృష్టీ  తన వైపుకే మళ్ళేలా చేసుకున్న సంభవం- కొరోనా వైరస్ పుట్టుకా, వ్యాప్తి అన్న దాన్లో అతిశయోక్తి లేదు. పెరుగుట విరుగుట కొరకే అంటే ఇదేనేమో. ప్రపంచమంతా పల్లెటూరి కంటే చిన్నదైపోయింది, అని అంతా గంతులేసి ఎంతో కాలం కాలేదు, అంతలోనే, "దూరం, దూరం" అంటూ ఎవరికి వాళ్ళం తలుపులు బిగించుకోనే రోజొచ్చింది. చుట్టూ … దూర దూరంగా ఆస్ట్రేలియాలోని చదవడం కొనసాగించండి

నాలో ఇంకొకరు

నాకు చిన్నప్పుడు సినిమాల్లో హీరో లేదా హీరోయిను మానసిక సంఘర్షణ అద్దంలో చూపించే సీన్లు భలే నచ్చేవి. జమున ఒక చిన్న గుడ్డల మూటతో ఇల్లు దాటి వెళ్ళబోతుంటే , అద్దంలో ఒక జమున వొచ్చి, పెద్ద స్పీచీ ఇచ్చి, "ఆగు వెళ్ళకు," అని సలహా ఇస్తుంది. సరే అని, జమున ఏదో ఆలోచించుకునేలోపే ఇంకొక జమున ప్రత్యక్షమై "నీకేమైనా పిచ్చా? దాని మాటలు వింటావే? బానే వుంది, నడు నడు," అని మళ్ళీ బయల్దేరదీస్తుంది. నిజం … నాలో ఇంకొకరుని చదవడం కొనసాగించండి

ఇరవై ఇరవైలో…

అడిలైడ్ నించి ఊరు మారి బ్రిస్బేన్ వచ్చి నాలుగేళ్ళ పైనే అయింది. బ్లాగుల్లో రాసుకోవడం మానేసీ దాదాపు మూడేళ్ళవుతుంది. ఈ రెండు సంఘటనలకీ ఎటువంటి సంబంధమూ లేదనీ, మొదటిది ఘటన అయితే రెండోది స్వయంకృతమనీ మనవి. రోజువారీగా బ్రతుకు ఉతికి, ఆరేసి, గంజి పెట్టి, ఇస్త్రీ చేసి మడతలేస్తుంటే, కుక్కిన పేలలా పడుండడం తప్ప ఇంకోటి చేతకాని సన్నాసులం, మనకీ బ్లాగులూ, కథలూ రాతలూ అవసరమా మనసా, అనే వేదంతం కొంత, నెట్ఫ్లిక్సూ, అమెజాన్ లాటి వ్యసనాలు … ఇరవై ఇరవైలో…ని చదవడం కొనసాగించండి

రిథం ఆఫ్ లైఫ్

  అయితే ఈ పోస్టు  షెన్ గురించి కాదు, అనన్య గురించి అసలే కాదు. వరుణ్ లాల్ గురించి!  అతని పట్టుదలా, పరిస్థితులకి తలవంచని ధైర్యమూ చూసి మనమందరమూ ఎంతైనా నేర్చుకోవల్సి వుంది. -------------------------------------------- బ్రిస్బేన్ నగరానికొచ్చి యేణ్ణర్థం కావొస్తుంది. మంచి వాతావరణం, అనువైన ఉద్యోగం, అంతా బాగుంది, దేవుడి దయవల్ల. బ్రిస్బేన్ నగరం లో సంగిత కార్యక్రమాలు ఎక్కవనే చెప్పాలి. వినడానికీ, పాల్గొనడానికీ చాలా అవకాశాలు దొరుకుతాయి. అయిటే, బ్రిస్బేన్ నగర విస్తీర్ణం వల్లా, ఇంకా అనేకానేక ఇతర … రిథం ఆఫ్ లైఫ్ని చదవడం కొనసాగించండి

ప్రస్థానం-అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ దాకా

పదిహేడేళ్ళ కాలం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఎనిమిది నెలల చిన్న పాపాయి మా అనూ , స్కూలు చదువు ముగించుకునేంత ! పదిహేడేళ్ళ కాలంలో మనం పెంచుకునే అనుబంధాలూ ఆప్యాయతలూ చిన్నవేమీ కావు. అవి వొదులుకొని దూరమవ్వాల్సినప్పుడు ఎంతో బాధ కలిగించేంత గాఢమైనవి. అందుకే పదిహేడేళ్ళు మమ్మల్ని కడుపులో పెట్టుకొన్న అడిలైడ్ నగరాన్నీ, మా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మమ్మల్ని గుండెల్లో దాచుకున్న స్నేహితులనీ వదిలి ఇంకో నగరానికి వెళ్ళాలన్న ఆలోచనే ఎంతో కష్టంగా … ప్రస్థానం-అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ దాకాని చదవడం కొనసాగించండి