శ్రీప ప్రియ సంగీతోపాసన……..

మా ఊళ్ళో శృతి-అడిలైడ్ సంస్థ అధ్వర్యం లో యేడాదికి రెండు లేదా మూడు కచేరీలు వుంటాయి. ఈ కచేరీలు చేసే కళాకారులు మెల్బోర్న్  సిడ్నీలకొచ్చే భారతీయ కళాకారులై వుంటారు. అయితే రెండు మూడేళ్ళుగా  ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ కళాకారులని కూడా పిలవడం అప్పుడప్పుడూ జరుగుతూంది. మెల్బోర్న్ వాస్తవ్యులు శ్రీ మురళీ కుమార్ గారి వయోలీన్ కచేరీ, సీడ్నీలో సంగీత పాఠశాల నడుపుతూన్న శ్రీమతి భవాని గోవిందన్ గారి కచేరీ, బ్రిస్బేన్ గాయనీ మణి శ్రీమతి సుష్మితా రవి … శ్రీప ప్రియ సంగీతోపాసన……..ని చదవడం కొనసాగించండి

సంగీత సాహిత్య సమలంకృతే -I

భారతీయ సంగీతంలో రాగానికీ, భావానికీ, లయకూ సమానమైన ప్రాధాన్యత వుంది. అందమైన భావాన్ని పలికించి నిలబెట్టటానికి రాగమూ, లయా కలిసి పనిచేస్తాయి. ఈ సూత్రానికి సినిమా సంగీతమూ మినహాయింపు కాదు. ఎంత అద్భుతమైన భావమైనా, శ్రావయమైన సంగీతం లేకపోతే చెవులకి వినిపించదు. ఎంత అత్యాధునికమైన సంగీతంతో హోరెత్తించినా అందమైన భావనలేకపోతే మనసుకి హత్తుకోదు.     మరీ ముఖ్యంగా, సంగీతమే ప్రధానమైన అంశం గా వుండే సినిమాల్లో పాటలు మామూలు పాటాలకంటే మంచి స్థాయిలో వుంటాయని ఆశిస్తాం. తెలుగులో … సంగీత సాహిత్య సమలంకృతే -Iని చదవడం కొనసాగించండి

శ్రీ సదా శివ దయితే మామవ- సదా సారంగ నయనే

నా కోరికల్లో తీరిన వాటివి లెక్కపెట్టొచ్చు కానీ, తీరని వాటిని లెక్క పెట్టాలంటే చాలా మంది కాళ్ళవీ చేతులవీ వేళ్ళు వాడాల్సొస్తుంది! ఒకటా, రెండా, బోలెడు. చెహోవ్ లా చకచకా కథలు రాసెయ్యాలనీ, శృతి తప్పకుండా రోజంతా పాడేసుకోవాలనీ, సగటున  సున్నా-ఒకటీ మధ్యలో వ్యాఖ్యలొచ్చే నా టపాలకి ఉన్నట్టుండి పాతికా-ముఫ్ఫై మధ్య వ్యాఖ్యలొచ్చేయాలనీ, ఓ.... చెప్పుకుంటూ పోతే అలా సంవత్సరమంతా చెప్పుకోవచ్చు. అయితే ఇన్ని కోరికల్లో నిజంగా ఒక్క తీరని కోరిక మాత్రం నన్ను చాలా బాధ … శ్రీ సదా శివ దయితే మామవ- సదా సారంగ నయనేని చదవడం కొనసాగించండి