దాదాపు పదహారేళ్ళ కింద మా ఇంటిల్లిపాదికీ చిన్నపిల్లల సినిమాలూ, అనిమేటెడ్ సినిమాలూ అలవాటయ్యాయి. ఆ అలవాటునించి పిల్లలు పెద్దయి బయటపడ్డా మేమిద్దరం చాలా పిల్లల సినిమాలు చూస్తూనే వుంటాం. పిల్లల సినిమాలూ- అనిమేటెడ్ సినిమాల ధర్మమా అని మాకు ఫెయిరీ టేల్స్ అన్నీ బాగా తెలిసిపోయాయి. మునుపు ఇవన్నీ ఒకేలాగుండేవి. ఆపదల్లో వున్న అందమైన రాజకుమారిని అంతే అందగాడూ ధీరుడూ అయిన రాజకుమారుడో (లేదా ఇంకే వీరుడో) వచ్చి అమ్మాయిని రక్షించి, చేపట్టటమే కథ. (ఇప్పటికీ చాలా సినిమాలు … మంత్రగత్తెలో మాతృత్వంని చదవడం కొనసాగించండి
సినిమాలు
బంగారానికి మెరుగు
ఎంత అందమైన బంగారు నగైనా మెరుగు పెడితేనే మెరుపొచ్చేది. ఎంత విలువైన వజ్రానికైనా సాన పెడితేనే ప్రకాశించేది. ఎంత అద్భుతమైన కళాకారుడైనా చెమటోడ్చి సాధన చేస్తేనే కళావిష్కరణ జరిగేది. అసలు కళాకారుడికి వచ్చే విలువా గుర్తింపూ కేవలం అతని జన్మ సంజాతమైన కళ వల్లేనా, లేక మిగతా హంగులవల్లనా అన్నది కూడా ప్రశ్నే. బంగారు పళ్ళేనికైనా గోడ అవసరమే కదా? మంచి చిత్రాన్ని మంచి ఫ్రేములో పెట్టకుంటే ఎవరూ గుర్తించరా? ఈ ప్రశ్నకి సమాధానం కోసం ఆ … బంగారానికి మెరుగుని చదవడం కొనసాగించండి
అరవ సినిమా అందాలు
మన పక్కింటివాళ్ళ పిల్లలు గోల్డు మెడళ్ళూ అవార్డులూ కొట్టేస్తూ చదువులో మెట్లెక్కుతున్నారనుకోండి, సంతోషిస్తాం, అభినందిస్తాం. మన పిల్లలు అంత కాకపోయినా, ఏదో కొంచెం పర్వాలేదన్నట్టు చదువుతుంటే, మనసు కొంచెం మూల్గినా, పోనీలే, ఎవరి ప్రతిభ వారిదే అని సరి పెట్టుకుంటాం. కానీ, మన పిల్లలు ఒక్కొక్క పరీక్షా అయిదేసి సార్లు రాస్తూ, పదో తరగతి గట్టెక్కడానికి తంటాలు పడుతూంటే? ఏడుపొస్తుంది, కదూ? మన పిల్లల చదువు గురించి ఒక బాధైతే, పక్క వాళ్ళ పిల్లలని చూసి ఏడుపు … అరవ సినిమా అందాలుని చదవడం కొనసాగించండి
లెక్కల గది
అన్ని వైఙ్ఞానిక శాస్త్రాల్లోనూ గణితం మహా రాణి వంటిది" అన్నాడు గణిత శాస్త్రఙ్ఞుడు కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ (1777-1855). ఎవరితోనూ సంబంధం లేకుండా ఫిజిక్సూ, కెమిస్ట్రీ, బయాలజీ లాటి అన్ని సైన్సుల భాగ్యాలనీ శాసిస్తూ టీవిగా దర్పంగా నిలబడి వున్న మహారాణి గుర్తొస్తుంది, మేథమేటిక్స్ ని తలచుకుంటే. అయితే గణిత శాస్త్రఙ్ఞులని ప్రధాన పాత్రలుగా పెట్టిన కధలు సాహిత్యం లో కొంచెం తక్కువ. సినిమాల్లో అయితే మరీ తక్కువ. అందుకే మొన్న ఏమీ తోచక టీవీలో చానెల్లు మారుస్తూ, … లెక్కల గదిని చదవడం కొనసాగించండి
నాదోంకార స్వర విదులు- జీవన్ముక్తులు
మనిషి మేధస్సు ఎన్నో విషయాలని కనుగొన్నది, కొన్ని మంచివీ, కొన్ని చెడ్డవీ కూడా. అయితే నా దృష్టిలో మనిషి మేధస్సు సాధించిన పెద్ద విజయాలు, తత్వ శాస్త్రమూ, లెక్కలూ, సంగీతమూ. తత్వ శాస్త్రమూ, లెక్కలూ పక్కన పెడితే సంగీతం కనుక్కొన్నందుకే మనిషి దాదాపు దేవుడికున్నంత సృజనాత్మకత చూపించాడేమో. ఆ సంగీతం భారతీయ సంగీతమైనా కావొచ్చు, పాశ్చాత్య సంగీతమైనా కవొచ్చు. భారతీయ, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాలు తీసుకొంటే ఒక వింతైన విషయం గోచరిస్తుంది. ఆ యా పధ్ధతుల్లో గొప్ప … నాదోంకార స్వర విదులు- జీవన్ముక్తులుని చదవడం కొనసాగించండి
నేనూ-తెలుగు సినిమా
అందరూ ఒకటే తెలుగు సినిమా రివ్యూలు రాసేస్తున్నారు. నేనేమో థియేటర్లో తెలుగు సినిమా చూసి దాదాపు అయిదేళ్ళవుతుంది. ఆఖర్న నేను చూసింది "గోదావరి" అనుకుంటా. ఆ తర్వాత "గమ్యం" సినిమా డీవీడీలో చూడటంతో నా తెలుగు సినిమా ప్రస్థానం ఆగిపోయింది. తెలుగు సినిమా హీరోయిన్ల దుర్భర దారిద్ర్యం తీరిపోయి వాళ్ళకి ఒంటి నిండా బట్టలిచ్చే నాధుడు (నిర్మాత?) దొరికేవరకూ నేను తెలుగు సినిమాలు చూడనని ఒట్టేసుకోవకటం వల్ల వచ్చిన ఉపద్రవం ఇది. ఇప్పుడంటే ఇలా తెలుగు సినిమాలూ … నేనూ-తెలుగు సినిమాని చదవడం కొనసాగించండి
What ever happened to Baby Jane అను అక్కా చెల్లెళ్ళ కథ
నాకు మా వూళ్ళో అన్నిటికంటే నచ్చేది లైబ్రరీ! అక్కడ దొరికే పాత సినిమా వీడియోలు! అన్నీ తీరిగ్గా వెతుక్కుని భాషా భేదం లేకుండా చూసి ఆనందిస్తాను. అందులో లైబ్రరీలకి పైసా కూడా చెల్లించక్కర్లేదు! అలాటి ఒకానొక రెయిడ్లో నాకు "Whatever happened to Baby Jane" అనే సినిమా దొరికింది. ఆ మధ్య నవతరంగంలో సౌమ్య "ది సైలెన్స్" సినిమా మీద రాసిన వ్యాఖ్యానం చదవగానే నాకెందుకో ఈ సినిమా చటుక్కున మనసులో మెదిలింది. సినిమా కంటే … What ever happened to Baby Jane అను అక్కా చెల్లెళ్ళ కథని చదవడం కొనసాగించండి
అందమైన ప్రేమ కథ
ఒక మంచి ప్రేమ కథలో ఏముంటాయి? ఒక ప్రేయసి- కింద జీన్సూ పైన షర్టనే నామధేయం కల గుడ్డ పీలికా-(యఙ్ఞోపవీతం మందాన ఓణీ అయినా పర్వాలేదు)- "ఏరా?మైండ్ దొబ్బిందా?" అంటూ మాట్లాడే సుకుమారి-"తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నే రెండంటా" అనే సొగసుకత్తె! ఒక ప్రేమికుడు- ఏం చదువుతున్నాడో, ఎందుకు బ్రతుకుతున్నాడో అర్ధం కాదు- ఇంట్లో అమ్మా-నాన్నలతోని మర్యాదగా మాట్లాడటం రాదు కానీ- వయసొచ్చిందనీ, అర్జంటుగా ప్రేమలో పడాలనీ మాత్రం బానే తెలుసు!"నీలాటి దరిద్రపు మొహాన్ని ఎవడు … అందమైన ప్రేమ కథని చదవడం కొనసాగించండి
కానీ….
చాలా సినిమాలు నేను పాటల కోసమే చూస్తాను. ఆ పాటల్లో ఎంత లీనమై పోతానంటే అసలు కథను కూడా పట్టించుకోను. అలాటి కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్లు సంగీత దర్శకులూ, గాయనీ గాయకులేనేమో అనిపిస్తుంది కూడా. అలాటి ఒక చిత్రమే 1991 లో రిలీజయిన "లేకిన్". నిజానికి ఈ సినిమా ఆడియో కేసెట్టు నాకు 1990 లోనే దొరికింది. సినిమా మాత్రం దాదాపు పదేళ్ళ తరువాత చూసాను. ఈ సినిమా నిర్మించింది సుప్రసిధ్ధ నేపధ్య గాయని … కానీ….ని చదవడం కొనసాగించండి
సూత్రం
"జీవితమే ఒక నాటక రంగం" అన్నారొక మహా కవి. నిజమేనేమో! నాటకంలోని పాత్రలలా మనలనందరినీ కలిపి ముడివేసే "సూత్రం" ఏదైనా వుందా? చాలా సార్లు మన జీవితాల్లో జరిగే సంఘటనలని విశ్లేషించుకుంటే మనందరికీ కలిగే సందేహమే ఇది. ఇద్దరు ఏమాత్రం ఒకరికొకరు పరిచయం లేని వాళ్ళూ, ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి వాళ్ళూ అయిన వ్యక్తులని ఏదో ఒక చిన్న సంఘటన ఒకే తుఫానులోకి నెట్టటం వినటానికి ఎంత విచిత్రంగా వున్నా చాలా సార్లు జరిగే విషయమే. ఈ విషయాన్నే దృశ్య … సూత్రంని చదవడం కొనసాగించండి