విజ్ఞాన శాస్త్రంలో వనితలు

                                              https://www.neccheli.com/2023/02/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%be%e0%b0%a8%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a4%e0%b0%b2/?fbclid=IwAR00u8RXq0HezpW61Wi2co3lMHUC9P8QSQCoW2wn820jWFW1EOJecM7E91U     ఈ శీర్షికన ప్రతీ నెలా ఒక మహిళా శాస్త్రవేత్తని పరిచయం చేస్తున్నాను. మొదటి వ్యాసం చదవడానికి లంకె నొక్కండి.                                            వారు వేసిన బాట నడిచొచ్చిన బాట ఎప్పుడూ మరవకూడదన్నారు పెద్దలు. గతాన్ని తవ్వుకోవడమంత వృథా ప్రయాస ఇంకోటుండదు, అని అనిపిస్తుంది మనకి. కానీ అలా గతాన్ని పునరావృతం చేసుకున్నప్పుడే మన ముందు తరాలు మన బాటని సుగమం చేయడానికెంత శ్రమ పడ్డారో, ఎన్ని కష్ట నష్టాలకోర్చారో,  దానికై ఎంత పాటు పడ్డారో మనకి అవగతమవుతుంది. … విజ్ఞాన శాస్త్రంలో వనితలుని చదవడం కొనసాగించండి

శంకరాభరణం-అనువాద కథల పుస్తకం

2012 నుంచి అప్పుడప్పుడూ నేను చేసిన అనువాద కథలన్నీ ఒక దగ్గర చేర్చి ఈ-పుస్తక రూపంలో అందరికీ ఉచితంగా అందుబాటులో వుండేలా అర్కైవ్ లో వుంచాను. చదవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. https://archive.org/details/2022_20221001/

అసలెందుకు?

“అసలెందుకు?”, ఈ ప్రశ్న మనం చాలా సార్లు వేసుకుంటాం. ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం, కుటుంబాన్ని ఎందుకు చూసుకుంటున్నాం, లాటి ప్రశ్నలకి సమాధానం తేలికే. కానీ, "పుస్తకం చదవడం ఎందుకు?", "మంచి సినిమా అయితే మాత్రం, చూడకపోతే యేం?", "ఇప్పుడా పాట నేర్చుకోకపోతే ఎవరికి నష్టం?" లాటి ప్రశ్నలకే, సమాధానం వెతకడం దాదాపు అసాధ్యం. చాలా సార్లు (దాదాపు ఎప్పుడూ), నేను మోటివేషన్ లేమితో బాధపడుతూ వుంటాను. ముఖ్యంగా రాయడం విషయంలో. ఎక్కడో ఏదో మంచి ఆలోచన తడుతుంది. … అసలెందుకు?ని చదవడం కొనసాగించండి

ముదితల్ నేర్వగ రాని విద్య కలదే…

నోబెల్ బహుమతి గ్రహీతా, డెభ్భై రెండేళ్ళ శాస్త్రఙ్ఞుడూ, foot-in-the-mouth అనే వ్యాధి గ్రస్తుడూ అయిన టిం హంట్ (Tim Hunt)ని కలిసిన వారెవరైనా వున్నారా? నేను కలిసాను. ఒకసారి కాదు, బోలెడు సార్లు. అయితే, ఆయన నా జీవితంలోకి వచ్చినప్పుడల్లా వేర్వేరు వేషాలతోనూ, మారు పేర్ల తోనూ వుండేవాడు.  ఎలాగంటారా? ఈ గుండ్రాల వెంట తిరుగుతూ మీరూ నాతో పాటు రండి. **** పాతికేళ్ళ కింద, ఎమ్మెస్సీ ఫిజిక్సు చదువుతూ మార్కుల కోసం యేడుస్తూ, సెంట్రల్ యూనివర్సిటీ … ముదితల్ నేర్వగ రాని విద్య కలదే…ని చదవడం కొనసాగించండి

అమ్మ

కొత్త సంవత్సరంలో ఇలాటి టపాతో ముందుకొస్తాననుకోలేదు. అయితే, జీవితానికి మన అనుకోవడాల్తో ఎలాటి ప్రమేయమూ లేదన్న విషయం ఈ  మధ్యనే  తెలుసుకున్నాను. సరిగ్గా మూడు వారాల క్రితం, జనవరి15 వ తేదీన మాఅమ్మగారు, శ్రీమతి విజయలక్ష్మిగారు పరమపదించారు. ఆవిడ వయసు అరవై మూడేళ్ళు. గత ఎనిమిదినెలలుగా అస్వస్థులైవున్నా, కోలుకుంటున్న సూచనలు బలంగా వుండడంతో మేమంతా ఆశలు పెంచుకున్నాం. వృధ్ధాప్యంలో సాధారణంగా వచ్చే డయాబిటీసు, కొలెస్ట్రాల్, అధిక రక్తపు పోటు వగైరా సమస్యలు ఆవిడకి లేవని మేము మురిసినంత సేపు … అమ్మని చదవడం కొనసాగించండి