మంత్రగత్తెలో మాతృత్వం

దాదాపు పదహారేళ్ళ కింద మా ఇంటిల్లిపాదికీ చిన్నపిల్లల సినిమాలూ, అనిమేటెడ్ సినిమాలూ అలవాటయ్యాయి. ఆ అలవాటునించి పిల్లలు పెద్దయి బయటపడ్డా మేమిద్దరం చాలా పిల్లల సినిమాలు చూస్తూనే వుంటాం. పిల్లల సినిమాలూ- అనిమేటెడ్ సినిమాల ధర్మమా అని మాకు ఫెయిరీ టేల్స్ అన్నీ బాగా తెలిసిపోయాయి. మునుపు ఇవన్నీ ఒకేలాగుండేవి. ఆపదల్లో వున్న అందమైన రాజకుమారిని అంతే అందగాడూ ధీరుడూ అయిన రాజకుమారుడో (లేదా ఇంకే వీరుడో) వచ్చి అమ్మాయిని రక్షించి, చేపట్టటమే కథ. (ఇప్పటికీ చాలా సినిమాలు … మంత్రగత్తెలో మాతృత్వంని చదవడం కొనసాగించండి

బంగారానికి మెరుగు

ఎంత అందమైన బంగారు నగైనా మెరుగు పెడితేనే మెరుపొచ్చేది. ఎంత విలువైన వజ్రానికైనా సాన పెడితేనే ప్రకాశించేది. ఎంత అద్భుతమైన కళాకారుడైనా చెమటోడ్చి సాధన  చేస్తేనే కళావిష్కరణ జరిగేది. అసలు కళాకారుడికి వచ్చే విలువా గుర్తింపూ కేవలం అతని జన్మ సంజాతమైన కళ వల్లేనా, లేక మిగతా హంగులవల్లనా అన్నది కూడా ప్రశ్నే. బంగారు పళ్ళేనికైనా గోడ అవసరమే కదా? మంచి చిత్రాన్ని మంచి ఫ్రేములో పెట్టకుంటే ఎవరూ గుర్తించరా? ఈ ప్రశ్నకి సమాధానం కోసం ఆ … బంగారానికి మెరుగుని చదవడం కొనసాగించండి

నీలాంబరి-సమీక్ష

      నీలాంబరి కథల పుస్తకంపై జులై నెల రచనలో వచ్చిన సమీక్ష. నా పట్ల ఆదరాభిమానాలూ, నా కథా రచన పట్ల నమ్మకమూ కలబోసి ఇంత లోతైన విశ్లేషణ రాసిన వసుంధర దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు. నీలాంబరి సమీక్ష

చేజారిన స్వర్గం

కొన్నిపుస్తకాలు మొదటిసారి చదివినప్పుడు మనకేమాత్రం నచ్చవు. ఏమిటీ చెత్తా అనిపిస్తుంది కూడా. కానీ అదే పుస్తకాన్ని కొన్నేళ్ళ తరవాత చదివితే కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. అప్పుడు, "ఈ పుస్తకం నేననుకున్నంత చెత్తగా లేదేమో" అనిపిస్తుంది. ఇంకా కొన్నేళ్ళు పోయాక చదివితే, "ఇంత మంచి పుస్తకం నాకెందుకు నచ్చలేదబ్బా!" అని కూడా అనిపిస్తుంది. పెరుగుతున్న వయసుతో పాటు మన ఆలోచనల్లో వస్తున్న మార్పులకీ, మనం ఇతర్ల ఆలోచనలూ అభిప్రాయాలూ గుర్తించి గౌరవించడం నేర్చుకుంటున్నామన్న విషయానికీ ఇంతకంటే పెద్ద ఋజువేమీ … చేజారిన స్వర్గంని చదవడం కొనసాగించండి

నీలాంబరి- కథల పుస్తకం

దాదాపు రెండేళ్ళ క్రితం, అంటే డిసంబరు 2011 ప్రాంతంలో నేనింతవరకూ రాసినవీ, అక్కడక్కడా పత్రికల్లో వచ్చినవీ కొన్ని కథలతో ఒక సంకలనం వేయిస్తే మంచిదేమో అన్న ఆలోచన వచ్చింది. మా కుటుంబ సభ్యులూ, శ్రేయోభిలాషి శ్రీ సురేశ్ కొలిచాల గారి ప్రోత్సాహంతో కథల ఎడిటింగ్ మొదలు పెట్టాను. ఆ పనిలో తల మునకలుగా వుండగానే హైదరాబాదులో మా అమ్మగారు అస్వస్థులవడం జరిగింది. ఆ తర్వాత ఒక ఏడెనిమిది నెలలు ఇంకే విషయం గురించీ ఆలోచించలేని ఒకలాటి మానసిక … నీలాంబరి- కథల పుస్తకంని చదవడం కొనసాగించండి

శ్రీప ప్రియ సంగీతోపాసన……..

మా ఊళ్ళో శృతి-అడిలైడ్ సంస్థ అధ్వర్యం లో యేడాదికి రెండు లేదా మూడు కచేరీలు వుంటాయి. ఈ కచేరీలు చేసే కళాకారులు మెల్బోర్న్  సిడ్నీలకొచ్చే భారతీయ కళాకారులై వుంటారు. అయితే రెండు మూడేళ్ళుగా  ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ కళాకారులని కూడా పిలవడం అప్పుడప్పుడూ జరుగుతూంది. మెల్బోర్న్ వాస్తవ్యులు శ్రీ మురళీ కుమార్ గారి వయోలీన్ కచేరీ, సీడ్నీలో సంగీత పాఠశాల నడుపుతూన్న శ్రీమతి భవాని గోవిందన్ గారి కచేరీ, బ్రిస్బేన్ గాయనీ మణి శ్రీమతి సుష్మితా రవి … శ్రీప ప్రియ సంగీతోపాసన……..ని చదవడం కొనసాగించండి

అందాల అడిలైడ్

 కిందటి వారం Lonely Planet  అడిలైడ్ ని తప్పక చూసి తీరాల్సిన పది నగరాల్లో ఒకటిగా పేర్కొంది. ------------------------- మెల్బోర్న్, సిడ్నీ వాస్తవ్యులు ఎప్పుడూ చిన్న చూపు చుస్తారనీ, "బాక్ వాటర్స్" అని పిలుస్తారనీ అడిలైడ్ నివాసులకి కొంచెం బాధ. నిజంగానే, రాత్రి ఏడయ్యేసరికి మూసేసే దుకాణాలూ, దాదాపు 1.2 మిలియన్ల కంటే దాటని జనాభా, పెద్ద పెద్ద కంపెనీలూ-ఉద్యోగావకాశాలు లేని ఎకానమీ అన్నీ కలిపి అడిలైడ్ చిన్న పల్లెకి ఎక్కువా, పెద్ద టౌను కి తక్కువగా … అందాల అడిలైడ్ని చదవడం కొనసాగించండి

పరోపకారార్థం…..

చాలా రోజులుగా నేను నా ఇల్లు, నా పిల్లలూ, నా సంసారం, నా సంగీతం, నా రాతలు అంటూ నాకు మాత్రమే చోటున్న సెల్ఫ్- సెంట్రిక్ ప్రపంచంలో కొట్టుకుపోతూన్న భావన కలుగుతూంది నాకు. బహుశా ఎదుగుతున్న వయసులో వున్న పిల్లలూ, మన ఆప్యాయతా, అటెన్షనూ ఆశించే పెద్దవాళ్ళూ వున్న ఈ ఫేజ్ లో అందరికీ అంతే కాబోలు.  అయితే కొంచెం కళ్ళు తెరిచి నాకేమాత్రమూ సంబంధం లేని మనుషులకోసం కొంత సమయం కేటాయించాలని ఈ సంవత్సరం ఆరంభంలో … పరోపకారార్థం…..ని చదవడం కొనసాగించండి

యుగళ గీతం

సాధారణంగా శాస్త్రీయ సంగీత కచ్చేరీల్లో ఒక ప్రధాన పాత్రధారి వుంటారు. (గాయకులే కావొచ్చు, వాయిద్య కారులే కావొచ్చు). వారికి పక్క వత్తాసుగా ఇంకా వేరే వాద్యకారులూ, మృదంగ విద్వాంసులూ వుండడం సాధారణం. ఉత్తర భారతీయ సంప్రదాయమైన హిందుస్తానీ సంగీతంలో తబల వాయిద్యం, సుర్ బహార్ వాయిద్యం వుంటాయి. దక్షిణ భారతీయ సంప్రదాయమైన కర్ణాటక సంగీతంలో ముఖ్య విద్వాంసులకి తోడుగా, మృదంగ సహకారం, వయోలీన్ (కొన్నిసార్లు వేణువు) వాదనా వుంటాయి. కొన్నిసార్లు ఇద్దరు ముఖ్య కళాకారులతో కచేరీలు కూడా … యుగళ గీతంని చదవడం కొనసాగించండి

అరవ సినిమా అందాలు

మన పక్కింటివాళ్ళ పిల్లలు గోల్డు మెడళ్ళూ అవార్డులూ కొట్టేస్తూ చదువులో మెట్లెక్కుతున్నారనుకోండి, సంతోషిస్తాం, అభినందిస్తాం. మన పిల్లలు అంత కాకపోయినా, ఏదో కొంచెం పర్వాలేదన్నట్టు చదువుతుంటే, మనసు కొంచెం మూల్గినా, పోనీలే, ఎవరి ప్రతిభ వారిదే అని సరి పెట్టుకుంటాం. కానీ, మన పిల్లలు ఒక్కొక్క పరీక్షా అయిదేసి సార్లు రాస్తూ, పదో తరగతి గట్టెక్కడానికి తంటాలు పడుతూంటే? ఏడుపొస్తుంది, కదూ? మన పిల్లల చదువు గురించి ఒక బాధైతే, పక్క వాళ్ళ పిల్లలని చూసి ఏడుపు … అరవ సినిమా అందాలుని చదవడం కొనసాగించండి