పరోపకారార్థం…..

చాలా రోజులుగా నేను నా ఇల్లు, నా పిల్లలూ, నా సంసారం, నా సంగీతం, నా రాతలు అంటూ నాకు మాత్రమే చోటున్న సెల్ఫ్- సెంట్రిక్ ప్రపంచంలో కొట్టుకుపోతూన్న భావన కలుగుతూంది నాకు. బహుశా ఎదుగుతున్న వయసులో వున్న పిల్లలూ, మన ఆప్యాయతా, అటెన్షనూ ఆశించే పెద్దవాళ్ళూ వున్న ఈ ఫేజ్ లో అందరికీ అంతే కాబోలు.  అయితే కొంచెం కళ్ళు తెరిచి నాకేమాత్రమూ సంబంధం లేని మనుషులకోసం కొంత సమయం కేటాయించాలని ఈ సంవత్సరం ఆరంభంలో … పరోపకారార్థం…..ని చదవడం కొనసాగించండి

యుగళ గీతం

సాధారణంగా శాస్త్రీయ సంగీత కచ్చేరీల్లో ఒక ప్రధాన పాత్రధారి వుంటారు. (గాయకులే కావొచ్చు, వాయిద్య కారులే కావొచ్చు). వారికి పక్క వత్తాసుగా ఇంకా వేరే వాద్యకారులూ, మృదంగ విద్వాంసులూ వుండడం సాధారణం. ఉత్తర భారతీయ సంప్రదాయమైన హిందుస్తానీ సంగీతంలో తబల వాయిద్యం, సుర్ బహార్ వాయిద్యం వుంటాయి. దక్షిణ భారతీయ సంప్రదాయమైన కర్ణాటక సంగీతంలో ముఖ్య విద్వాంసులకి తోడుగా, మృదంగ సహకారం, వయోలీన్ (కొన్నిసార్లు వేణువు) వాదనా వుంటాయి. కొన్నిసార్లు ఇద్దరు ముఖ్య కళాకారులతో కచేరీలు కూడా … యుగళ గీతంని చదవడం కొనసాగించండి

అరవ సినిమా అందాలు

మన పక్కింటివాళ్ళ పిల్లలు గోల్డు మెడళ్ళూ అవార్డులూ కొట్టేస్తూ చదువులో మెట్లెక్కుతున్నారనుకోండి, సంతోషిస్తాం, అభినందిస్తాం. మన పిల్లలు అంత కాకపోయినా, ఏదో కొంచెం పర్వాలేదన్నట్టు చదువుతుంటే, మనసు కొంచెం మూల్గినా, పోనీలే, ఎవరి ప్రతిభ వారిదే అని సరి పెట్టుకుంటాం. కానీ, మన పిల్లలు ఒక్కొక్క పరీక్షా అయిదేసి సార్లు రాస్తూ, పదో తరగతి గట్టెక్కడానికి తంటాలు పడుతూంటే? ఏడుపొస్తుంది, కదూ? మన పిల్లల చదువు గురించి ఒక బాధైతే, పక్క వాళ్ళ పిల్లలని చూసి ఏడుపు … అరవ సినిమా అందాలుని చదవడం కొనసాగించండి

అనువాద నవల

మన పూర్వపు తరాల మనుషులతో మాట్లాడడం, ఆ కాళానైకి చెందిన రచనలు చదవడం నాకు చాలా ఇష్టం.   మన బ్రతుకుల్లో, మనస్తత్వాలలో, ఆలోచనలలో వచ్చిన మార్పులని బేరీజు వేసుకోవడానికీదో మంచి మార్గమని నా అభిప్రాయాం. కిందటి తరాల తెలుగు రచనలు చదువుతూంటే,  సంఘంలో  ఆడవాళ్ళ పరిస్థితి ఎంత మారిందో అర్థమవుతుంది మనకి. అయితే ఆడవాళ్ళ పరిస్థితి కొన్నేళ్ళ కింద భారతీయ సమాజంలోనే కాదు, పాశ్చాత్య సమాజంలోనూ అంతే అని మనకి చెప్పే రచనలు నేనైతే ఎక్కువగా చదవలేదు. … అనువాద నవలని చదవడం కొనసాగించండి

అమ్మ

కొత్త సంవత్సరంలో ఇలాటి టపాతో ముందుకొస్తాననుకోలేదు. అయితే, జీవితానికి మన అనుకోవడాల్తో ఎలాటి ప్రమేయమూ లేదన్న విషయం ఈ  మధ్యనే  తెలుసుకున్నాను. సరిగ్గా మూడు వారాల క్రితం, జనవరి15 వ తేదీన మాఅమ్మగారు, శ్రీమతి విజయలక్ష్మిగారు పరమపదించారు. ఆవిడ వయసు అరవై మూడేళ్ళు. గత ఎనిమిదినెలలుగా అస్వస్థులైవున్నా, కోలుకుంటున్న సూచనలు బలంగా వుండడంతో మేమంతా ఆశలు పెంచుకున్నాం. వృధ్ధాప్యంలో సాధారణంగా వచ్చే డయాబిటీసు, కొలెస్ట్రాల్, అధిక రక్తపు పోటు వగైరా సమస్యలు ఆవిడకి లేవని మేము మురిసినంత సేపు … అమ్మని చదవడం కొనసాగించండి

సంగీత సాహిత్య సమలంకృతే -I

భారతీయ సంగీతంలో రాగానికీ, భావానికీ, లయకూ సమానమైన ప్రాధాన్యత వుంది. అందమైన భావాన్ని పలికించి నిలబెట్టటానికి రాగమూ, లయా కలిసి పనిచేస్తాయి. ఈ సూత్రానికి సినిమా సంగీతమూ మినహాయింపు కాదు. ఎంత అద్భుతమైన భావమైనా, శ్రావయమైన సంగీతం లేకపోతే చెవులకి వినిపించదు. ఎంత అత్యాధునికమైన సంగీతంతో హోరెత్తించినా అందమైన భావనలేకపోతే మనసుకి హత్తుకోదు.     మరీ ముఖ్యంగా, సంగీతమే ప్రధానమైన అంశం గా వుండే సినిమాల్లో పాటలు మామూలు పాటాలకంటే మంచి స్థాయిలో వుంటాయని ఆశిస్తాం. తెలుగులో … సంగీత సాహిత్య సమలంకృతే -Iని చదవడం కొనసాగించండి

వికటించిన హాస్యం

హాస్యం చాలా సున్నితంగా వుండాలన్న విషయం అందరికీ తెలిసిందే. మాటలతో నైనా, చేతలతోనైనా ఎవరినైనా వుడికిస్తే, ఆ తర్వాత ఆ సంగతి ఎప్పుడు తలచుకున్నా నవ్వు రావాలి. "అతి సర్వత్ర వర్జయేత్" అన్న సూక్తి హాస్యానికి వర్తించినంతగా ఎక్కడా వర్తించదేమో. ఈ మధ్య నే జరిగిన నర్సు జసింతా సల్దానా విషాద ఉదంతం వింటే ఇదే అర్ధమవుతుంది. ప్రపంచమంతటా మీడియా చేసే అతి వికృత రూపాలు దాలుస్తుందేమో అన్న అనుమానం రాక మానదు ఈ ఉదంతాన్ని పరిశీలిస్తే. … వికటించిన హాస్యంని చదవడం కొనసాగించండి

లెక్కల గది

అన్ని వైఙ్ఞానిక శాస్త్రాల్లోనూ గణితం మహా రాణి వంటిది" అన్నాడు గణిత శాస్త్రఙ్ఞుడు కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ (1777-1855). ఎవరితోనూ సంబంధం లేకుండా ఫిజిక్సూ, కెమిస్ట్రీ, బయాలజీ లాటి అన్ని సైన్సుల భాగ్యాలనీ శాసిస్తూ టీవిగా దర్పంగా నిలబడి వున్న మహారాణి గుర్తొస్తుంది, మేథమేటిక్స్ ని తలచుకుంటే. అయితే గణిత శాస్త్రఙ్ఞులని ప్రధాన పాత్రలుగా పెట్టిన కధలు సాహిత్యం లో కొంచెం తక్కువ. సినిమాల్లో అయితే మరీ తక్కువ. అందుకే మొన్న ఏమీ తోచక టీవీలో చానెల్లు మారుస్తూ, … లెక్కల గదిని చదవడం కొనసాగించండి

నాదోంకార స్వర విదులు- జీవన్ముక్తులు

మనిషి మేధస్సు  ఎన్నో విషయాలని కనుగొన్నది, కొన్ని మంచివీ, కొన్ని చెడ్డవీ కూడా. అయితే నా దృష్టిలో మనిషి మేధస్సు సాధించిన పెద్ద విజయాలు, తత్వ శాస్త్రమూ, లెక్కలూ, సంగీతమూ. తత్వ శాస్త్రమూ, లెక్కలూ పక్కన పెడితే సంగీతం కనుక్కొన్నందుకే మనిషి దాదాపు దేవుడికున్నంత సృజనాత్మకత చూపించాడేమో.  ఆ సంగీతం భారతీయ సంగీతమైనా కావొచ్చు, పాశ్చాత్య సంగీతమైనా కవొచ్చు. భారతీయ, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాలు తీసుకొంటే ఒక వింతైన విషయం గోచరిస్తుంది. ఆ యా పధ్ధతుల్లో గొప్ప … నాదోంకార స్వర విదులు- జీవన్ముక్తులుని చదవడం కొనసాగించండి