అసలెందుకు?

“అసలెందుకు?”, ఈ ప్రశ్న మనం చాలా సార్లు వేసుకుంటాం. ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం, కుటుంబాన్ని ఎందుకు చూసుకుంటున్నాం, లాటి ప్రశ్నలకి సమాధానం తేలికే. కానీ, "పుస్తకం చదవడం ఎందుకు?", "మంచి సినిమా అయితే మాత్రం, చూడకపోతే యేం?", "ఇప్పుడా పాట నేర్చుకోకపోతే ఎవరికి నష్టం?" లాటి ప్రశ్నలకే, సమాధానం వెతకడం దాదాపు అసాధ్యం. చాలా సార్లు (దాదాపు ఎప్పుడూ), నేను మోటివేషన్ లేమితో బాధపడుతూ వుంటాను. ముఖ్యంగా రాయడం విషయంలో. ఎక్కడో ఏదో మంచి ఆలోచన తడుతుంది. … అసలెందుకు?ని చదవడం కొనసాగించండి